Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ చలాకీ చంటి. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో అలరించిన చంటి.. ఇప్పుడు స్మాల్ స్కీన్ కు దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు గురైన చంటి.. కోలుకున్న అనంతరం తిరిగి అవకాశాల కోసం ప్రయత్నించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మేజర్ హార్ట్ ఎటాక్ నుండి వైద్యుల కృషితో, కుటుంబం, స్నేహితులు, అభిమానుల మద్దతుతో కోలుకున్నానని తెలిపారు. ఆరోగ్యం, కుటుంబం విలువను ఈ సంఘటన తనకు నేర్పినట్లు తెలిపారు.

Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..
Chalaki Chanti

Updated on: Aug 23, 2026 | 2:21 PM

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చలాకీ చంటి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన చంటి.. ఇటీవల గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి తన కెరీర్‌కు అడ్డుపడిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అహంకారం ఉందని, షూటింగ్‌లో కొన్ని అడుగుతానని తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుని సాక్షిగా, తన వస్త్రంపై ఒట్టేసి చెబుతూ, తన ఎదుగుదలకు అడ్డుపడిన వారంతా సర్వనాశనం అవుతారని అన్నారు. “నా ఒంటి మీద ఉండే వస్త్రం అనే పదం ఎందుకు మాట్లాడానంటే, చూసే ఆడియన్స్ లో కొంతమందికి మాత్రమే అర్థం అవుతుంది వస్త్రం అనే పదం ఎందుకు వాడానో,” అంటూ ఆయన ఆ మాట ప్రాధాన్యతను వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

కొందరు వ్యక్తులు తన గురించి తప్పుడు ప్రచారం చేశారని, తనకు అహంకారం ఉందని, షూటింగ్‌కు వస్తే కొన్ని అడుగుతానని అసత్యాలు ప్రచారం చేశారని చంటి ఆరోపించారు. అంతేకాకుండా, తనకు సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించి, తన కెరీర్‌లో జరగాల్సిన కొన్ని కీలక సంఘటనలను అడ్డుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా చేసిన ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోతారని, వారు ఎవరైనా సరే అని చంటి తీవ్రంగా శపించారు. “ఇంతవరకు ప్రపంచంలో నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు, సర్వనాశనం అయిపోతారు ఆ కొడుకులు,” అంటూ చంటి వ్యక్తం చేసిన భావోద్వేగం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

జబర్దస్త్ నుంచి మూడుసార్లు బయటకు వెళ్లడం, మళ్లీ రావడం గురించి విమర్శకులు లేవనెత్తిన ప్రశ్నలపై చంటి తనదైన రీతిలో స్పందించారు. గతంలో టీమ్ లీడర్ల అభిప్రాయాల పై ఆయన మాట్లాడా. “జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన నటుల గ్రాఫ్ పడిపోయిందని అనడం సరికాదు” అని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

Loading...
Unable to load recommendations.
Follow Us