Nandamuri Balakrishna: మరోసారి బాలయ్య కోసం రంగంలోకి దిగనున్న బోయపాటి.?

|

May 17, 2022 | 8:42 AM

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఇటీవలే అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న విషయం తెలిసిందే.

Nandamuri Balakrishna: మరోసారి బాలయ్య కోసం రంగంలోకి దిగనున్న బోయపాటి.?
Boyapati Srinu Nandamuri B
Follow us on

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఇటీవలే అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న విషయం తెలిసిందే. నటసింహం కెరీర్ లో ఈ సినిమా 107వ మూవీ. ఈ సినిమాకు మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ మధ్య ఈ సినిమానుంచి బాలయ్య లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రపోస్తుండగా శ్రుతిహాసన్ హీరోయిన్ గ నటిస్తుంది. ఈ సినిమాలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నారు బాలయ్య.

ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తాయాని అంటున్నారు అభిమానులు. ఈ రెండు సినిమాలో బ్యాక్ టు బ్యాక్ ఫినిష్ చేసి ఆ వెంటనే మరోసారి బోయపాటితో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నారట బాలయ్య. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోసారి బాలయ్య కోసం స్ట్రాంగ్ కథను సిద్ధం చేయాలనీ చూస్తున్నారా బోయపాటి. బాలయ్య గోపీచంద్ మలినేని, అనిల్ సినిమాలు పూర్తీ చేసేలోగా బోయపాటి రామ్ తో సినిమా చేసేసి బాలయ్య కోసం కథను సిద్ధం చేసే పని మీద కూర్చోనున్నాడని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: ఆడిపోయే ఫోజులతో కవ్విస్తున్న కళావతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreemukhi: యెల్లో డ్రెస్ లో యాంకరమ్మ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Shamna Kasim: పింక్ శారీ లో పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతున్న షామ్నా లేటెస్ట్ పిక్స్