ఇండస్ట్రీలో మరో విషాదం.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన సింగర్

మల్లికా అసలు పేరు విజయ లక్ష్మి. మల్లికా రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో  ఇంట్లోని గదిలో ఉరివేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అనంతరం స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం, కోత్వాలి నగర్‌లోని సీతాకుండ్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో మల్లికా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.

ఇండస్ట్రీలో మరో విషాదం.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన సింగర్
Malika Rajput
Follow us

|

Updated on: Feb 13, 2024 | 8:23 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది ప్రముఖ సింగర్, నటి మల్లికా రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ నటి బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడింది. మల్లికా అసలు పేరు విజయ లక్ష్మి. మల్లికా రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో  ఇంట్లోని గదిలో ఉరివేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అనంతరం స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం, కోత్వాలి నగర్‌లోని సీతాకుండ్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో మల్లికా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.

మల్లిక తల్లి సుమిత్రా సింగ్ మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగినప్పుడు తమకు తెలియదని అన్నారు. ”గది తలుపు మూసి ఉంది.కానీ లైట్ ఆన్ చేసి ఉంది. దాంతో నాకు అనుమానం వచ్చి తలుపు కొట్టాను.  ఎంత తలుపు కొట్టినా తీయలేదు. చివరికి, నేను కిటికీలోంచి చూసాను,  ఫ్యాన్ కు నా కూతురు వేలాడుతూ కనిపించింది. నేను నా భర్తకు, తెలిసిన వారికి ఫోన్ చేసాను, కానీ నా కూతురు చనిపోయింది అంటూ కన్నీరు మున్నీరయ్యారు మల్లిక తల్లి.

ఈ ఘటనపై పోలీసు అధికారి శ్రీరామ్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమికంగా చూస్తే ఇది ఆత్మహత్యేనని తెలుస్తోంది. ఇది  ఆత్మహత్య లేక హత్య అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే  తేలుతుంది. ఆ నివేదిక ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అయితే మల్లికా మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మల్లికా రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మల్లికా రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మల్లికా రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.