Bigg Boss Soniya: భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె తన ఆట, మాట తీరుతో బాగానే ఫేమస్ అయ్యింది. ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన ఆమె తాజాగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Bigg Boss Soniya: భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
Bigg Boss Soniya Akula

Updated on: Feb 12, 2026 | 10:55 AM

తెలంగాణలో పుట్టి పెరిగిన సోనియా ఆకుల 2019లో రిలీజైన జార్జి రెడ్డి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో హీరోకు సోదరిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆశా ఎన్ కౌంటర్, కరోనా వైరస్ సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇలా సినిమాలు చేస్తున్న సమయంలోనే సోనియాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఎనిమిదో సీజన్ గా కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆమె తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. తన ఓవర్ యాటిట్యూడ్ కారణంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది సోనియా. ఆ పై హౌస్ నుంచి బయటకొచ్చిన వెంటనే ప్రియుడు యష్‌ ను వివాహం చేసుకుంది. 2024 డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగ్గా.. ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందీ అందాల తార. గతేడాది డిసెంబర్ 08న సోనియా- యష్‌ దంపతులకు ఒక కూతురు పుట్టింది. తమ కూతురికి శిఖ వీరగోని అని నామకరణం చేసిన సోనియా ఆకుల దంపతులు ప్రస్తుతం తమ గారాల పట్టి పెంపకలో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సోనియా కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో కొబ్బరికాయ కొట్టి కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసింది సోనియా. భర్త యష్ కూడా ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే సోనియా ఏం బిజినెస్ స్టార్ట్ చేసిందో ఈ వీడియోలో క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న బిగ్ బాస్ సోనియా వీడియో ఇదిగో..

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.