
కనీవినీ ఎరుగని రీతిలో టాస్కులు, ఎలిమినేషన్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అనుకున్నదానికంటే చాలా రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా గతలో ఎన్నడూ లేని విధంగా ఎవరూ ఊహించని రీతిలో కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. పదో వారంలో ఢీ డ్యాన్సర్ శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక పదకొండో వారం నామినేషన్స్ లోనూ అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. సాధారణంగా హౌస్ లో ఉంటే కంటెస్టెంట్స్… వివిధ కారణాలు చెప్పి తోటి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేస్తారు. అయితే ఈసారి ఈ అవకాశం డిక్టేటర్స్ కు కల్పించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన ఎక్స్ హౌస్ మేట్స్ ను మళ్లీ హౌస్ లోకి పిలిపించి, వీరి చేత హౌస్ మేట్స్ ను నామినేట్ చేయించారు. అందులో భాగంగానే శాలిని, మిథిలేష్ రెడ్డి, అపూర్వ ఝాన్సీ, చరణ్, దక్షి , చైత్ర, శ్వేత, సృష్టి.. ఇలా వీరంతా కూడా మళ్ళీ ఇప్పుడు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. వివిధ కారణాలు చెప్పి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేశారు. అలా పదకొండో వారంలో జబర్దస్త్ నరేష్ కెప్టెన్ కావడంతో నామినేషన్స్ నుంచి తప్పించుకోగా.. మిగిలిన 11 మందిలో ఏకంగా 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు.
కాగా డిక్టేటర్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన శాలిని – నీతూ, మిథిలేష్ రెడ్డి – ముఖేష్, అపూర్వ – వర్షిణి, ఝాన్సీ- దెబ్జానీ, చరణ్ – సుధీర్, దక్షి – నీతూ, చైత్ర – వంశీ, శ్వేత – రాంప్రసాద్, సృష్టి – వర్షిణి ఇలా హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు. అలా 11వ వారంలో త్రిగుణ్, వర్షిణి, ముఖేష్, దెబ్జానీ, రాంప్రసాద్, శివ, నీతూ మాస్టర్, సుధీర్ ఇలా మొత్తం ఎనిమిది మంది ఈ వారం నామినేషన్ లోకి వచ్చారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ వారం కచ్చితంగా యాంకర్ వర్షిణీ లేదా సుధీర్ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరూ బయటకు వెళతారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చివరి వరకు సాగే ఓటింగులో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.