
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో వారంలోకి కూడా అడుగు పెట్టింది. సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ గా మొదలైన ఈ రియాలిటీ షోలో ఎలిమినేషన్లు కూడా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. మొదటి వారంలో చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీరిలో చరణ్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారను. మూడవ వారం ఎలిమినేషన్ లేకపోయినా వైల్డ్ కార్డు ద్వారా అదే వారం హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన రూ. 15 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఇక నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ కాగా, ఐదవ వారం చరణ్, అపూర్వ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఇక ఆరోవారం షాలినీ త్రుటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఆమె సీక్రెట్ రూమ్ లో ఉంది. ఇదిలా ఉంటే అప్పుడే బిగ్ బాస్ టాప్- 5 కంటెస్టెంట్స్ ఎవరు? కప్పు ఎవరు గెలుస్తారు? అన్న విషయాలపై చర్చ మొదలైంది. ఇప్పటికే మాజీ కంటెస్టెంట్స్, విన్నర్లు, బిగ్ బాస్ రివ్యూయర్లు ఈ విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా జబర్దస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రంగస్థలం మహేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్10 ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో నాకు జబర్దస్త్ నరేష్ అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అతను ఎలా ఆడినా నాకు నచ్చుతాడు. నరేష్ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే చాలా సంతోషిస్తాన. ఇతరుల విజయాన్ని చూసి నిజంగా సంతోషపడే మనస్తత్వం నాకు బాగా ఇష్టం. ఎదుటివారు సక్సెస్ అయితే దాన్ని మన సక్సెస్‌లా భావించాలి. ఇతరులు ఎదుగుతున్నప్పుడు అసూయ పడకూడదు. ఈ రోజుల్లో మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. నాకు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తుల గురించి మాత్రమే నేను చెప్పగలను’ అని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే కార్యక్రమంలో జబర్దస్త్ కార్యక్రమం పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మహేష్.. ‘మల్లెమాల వారు నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమం అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది. ఈ జబర్దస్త్ కార్యక్రమంలో రెండు రోజులు పని చేస్తే చాలు నెలకు సరిపడా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నెల మొత్తం చాలా సంతోషంగా గడపొచ్చు’ అని పేర్కొన్నాడు మహేష్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి