Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే ఇవ్వాలి.. కౌశల్ మరో వీడియో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మాజీ కంటెస్టెంట్స్, రివ్యూయర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టాప్-5లో ఎవరెవరు ఉంటారో అలాగే విజేత ఎవరన్న దానిపై తమ అంచనాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మరో వీడియోను రిలీజ్ చేశారు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే ఇవ్వాలి.. కౌశల్ మరో వీడియో
Bigg Boss Telugu 10

Updated on: Oct 21, 2026 | 11:12 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఆరోవారం కూడా హాట్ హాట్ గా సాగుతుంది. చాలామంది ఊహించినట్లుగానే సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిపోయిన షాలినీ మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ మేట్స్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే గత సీజన్లతో పోల్చితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య మాటలు హద్దులు మీరుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరైతే ‘కొట్టుకుందాం.. బయటకు రారా.. చెంప పగిలిపోద్ది’ అంటూ రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పొర్లుతున్న బూతులు, జరుగుతున్న గొడవలపై సోషల్ మీడియాలోనూ తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా వీటిని సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10ను ‘ది లౌడెస్ట్ సీజన్ ఆఫ్ ఆల్'( THE LOUDEST SEASON OF ALL!) అంటూ సెటైర్స్ వేశాడు. బిగ్ బాస్ హౌస్ లో అరిస్తే కప్పు రాదు సామీ.. ఆటలో గెలిస్తేనే వస్తాది అంటూ కంటెస్టెంట్లకు హిత బోధ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు కౌశల్. అందులో ఇలా చెప్పుకొచ్చాడు.

 

ఇవి కూడా చదవండి

‘మనిషికి అహంకారం ఉండొచ్చు తప్పులేదు.. కానీ అదే అహంకారం నెత్తికెక్కి శివతాండవం చేస్తే.. అక్కడి నుంచి కొడితే డైరెక్టుగా పాతాళానికి పడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఇంకా సగం మంది కూడా ఎలిమినేట్ అవ్వలేదు. అప్పుడే కప్పు నాది.. నేనే టైటిల్ విన్నర్ అన్న అహం కారంతో ఎవరు నామినేషన్స్ లో ఉన్నా మధ్యలో దూరేస్తున్నారు. ఎవరో గొడవ పడితే ఎవరో మధ్యలో దూరుతున్నారు. నాకు తెలిసి బిగ్ బాస్ 10 లౌడెస్ట్ సీజన్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్లంతా బాగా డిసైడ్ అయి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారేమో. బహుశా గట్టిగా అరిస్తేనే.. కప్పు గెల్చవచ్చు అని. సో.. అరిస్తే కప్పు రాదు సామీ.. గేమ్ ఆడితే వస్తాది.. గెలిస్తే వస్తాది.. ముందు మీకిచ్చిన టాస్కుల్లో గెలిచి చూపించండి. అప్పుడు కప్పు గురించి ఆలోచించండి’

‘ఎప్పుడైతే హౌస్ లో అందరూ అరవడం మొదలు పెడతారో.. హౌస్ లో సైలెంట్ గా, కామ్ గా, ప్రశాంతంగా ఉన్న వాళ్ల మీదే అందరి దృష్టి పడుతుంది. ఇది జస్ట్ హ్యూమన్ సైకాలజీ. ఈ సీజన్ లో ప్రతి ఒక్కడూ అరుస్తున్నాడు. నాకు తెలిసి నరేష్ (జబర్దస్త్ నరేష్) ఈజ్ వెరీ క్యూట్. కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. నాకు తెలిసి అతనికే ఇవ్వాలి బిగ్ బాస్ కప్పు’ అని చెప్పుకొచ్చాడు కౌశల్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ విన్నర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ లో ఎక్కువగా అరుస్తోన్న రోహిత్ ఇతర కంటెస్టెంట్ల గురించే కౌశల్ మాట్లాడని పక్కాగా అర్థమవుతోంది.

కౌశల్ మందా వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us