AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: 5 రోజుల్లోనే ఎలిమినేట్.. ‘బిగ్ బాస్ 10’ నుంచి చైత్ర అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొలి వారమే ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరూ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అలా మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ ను వీడిన వారిలో నటి చైత్ర రాయ్ కూడా ఒకరు.

Bigg Boss Telugu 10: 5 రోజుల్లోనే ఎలిమినేట్.. 'బిగ్ బాస్ 10’ నుంచి చైత్ర అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 14, 2026 | 3:13 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా జరుగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో అప్పుడే వారం రోజలు గడిచిపోయాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి వారంలోనే హౌస్ లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్‌ను ఎలిమినేట్ అయ్యారు. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా ముందుగా ఆర్జే చరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత మరుసటి రోజే ప్రముఖ చైత్ర రాయ్ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చింది. కాగా మొదటి వారం లోనే ఇద్దరు కంటెస్టెంట్స్ ని , అది కూడా ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ చేయడం అనేది ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోనే ఎప్పుడూ జరగలేదు. కనీసం టాస్కులు ఆడే అవకాశం కూడా ఇవ్వకుండా , కేవలం 5 రోజుల్లోనే చరణ్ , చైత్ర లను కంటెస్టెంట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది వీరిద్దరినీ సీక్రెట్ రూమ్ లో ఉంచి ఉంటారని,సమయానుకులంగా మళ్లీ హౌస్ లోకి మళ్లీ తీసుకొస్తారని అందరూ భావించారు. ఈ రూమర్స్ అన్నింటికీ కింగ్ నాగార్జున స్వయంగా చెక్ పెట్టారు. ఆర్జే చరణ్, ఛైత్ర నిజంగానే వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యారని ఆదివారం ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. అంతే కాదు , ఆ ఇద్దరితో స్పెషల్ గా వీడియో కాల్ లో కూడా మాట్లాడాడు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ లోకి రాకముందే చైత్ర రాయ్ కు బుల్లితెరపై మంచి గుర్తింపు ఉంది. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది. అలాంటి నటి బిగ్ బాస్ షో నుంచి మొదటి వారమే ఎలిమినేట్ కావడంపై ఆమె అభిమానులు నిరాశతో ఉన్నారు. కనీసం తనను తాను నిరూపించుకునేందుకు మరో వారమైనా చైత్రకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఛైత్ర రాయ్ విషయంలో మరో ఆసక్తికర అంశం ఆమె రెమ్యునరేషన్. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె కేవలం ఐదు రోజులే ఉంది. దీంతో ఆమెకు ఎంత పారితోషికం దక్కుతుందన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ లో ఉన్నందుకు చైత్ర రాయ్‌కు వారానికి సుమారు రూ.2.25 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.35 వేల వరకు పారితోషికం వస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే చైత్ర , చరణ్ లు ఈ షో నుంచి పూర్తిగా అయితే ఎలిమినేట్ అవ్వలేదని టాక్. త్వరలోనే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలతో పాటు చైత్ర, చరణ్ లను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్  లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us