ఉర్ఫీ జావెద్.. ఈ పేరు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆమె వేసుకునే వింత డ్రెస్సులు ఎప్పుడూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంటాయి. ధరించే అవుట్ ఫిట్స్‌తో వివాదాలు క్రియేట్ చేయడం ఉర్ఫీకి వెన్నతో పెట్టిన విద్య. అందాల ప్రదర్శన చేసేలా పొట్టి.. పొట్టి డ్రస్సులు ధరించి ఈవెంట్లు, ఫంక్షన్లలో సందడి చేస్తూ ఉంటుంది. ఉర్ఫీ వచ్చిందంటే.. ఆ ఏరియాలో ఫోటోగ్రాఫర్లు ఎగబడి క్లిక్స్ తీస్తారు. గతంలో ఈ భామ బిగ్ బాస్‌కి వెళ్లి కూడా చాలా హడావిడి చేసింది. సినిమాలు, సీరియల్స్‌లో అవకాశాలు, మీడియా అటెన్షన్ కోసం ఆమె ఇలా చేస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఆమెకు ఎవరూ చాన్సులు మాత్రం ఇవ్వడం లేదు. అందుకే సోషల్ మీడియానే నమ్మకుని.. వింత డ్రస్సులతో కుర్రకారు ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటుంది. తరచూ వింత డ్రెస్సులు వేసుకుంటూ ట్రోలర్లకు టార్గెట్ అవుతున్న ఉర్ఫీ జావేద్.. మరోసారి వైరల్ అయ్యింది. తాజాగా ఆమె న్యూ లుక్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
ఉర్ఫీ గుండుతో దర్శనమివ్వడంతో.. నెటిజన్లు కంగుతిన్నారు. ఎండాకాలంలో చెమట, ఉక్కపోత నుంచి రిలీఫ్ కోసం చాలామంది గుండు కొట్టించుకుంటారు. ఉర్ఫీ కూడా అదే ఐడియాను ఫాలో అయిందని కొందరు అంటున్నారు. ఈ లుక్ కూడా బాగానే ఉందని కొందరు అంటుంటే.. ఏంటి తల్లీ మళ్లీ కొత్తగా ఏం చేయబోతున్నావ్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఉర్ఫీ లేటెస్ట్ లుక్ నెట్టంట తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.