AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautham Krishna: మురళీ నాయక్ కుటుంబానికి బిగ్ బాస్ గౌతమ్ ఆర్థిక సాయం.. నెటిజన్ల ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్

'బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌతమ్ కృష్ణ. మొదటి సారి మెయిన్ కంటెస్టెంట్ గా వెళ్లి అంతగా ఆకట్టుకోలేకపోయాడీ హ్యాండ్సమ్ యాక్టర్. రెండో సారి మాత్రం వైల్డ్ కార్డ్ తో వెళ్లి వైల్డ్ ఫైర్ లా విజృంభించాడు. రన్న రప్ గా నిలిచి తన సత్తాను చూపించాడు.

Gautham Krishna: మురళీ నాయక్ కుటుంబానికి బిగ్ బాస్ గౌతమ్ ఆర్థిక సాయం.. నెటిజన్ల ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్
Gautham Krishna
Basha Shek
|

Updated on: Jul 02, 2025 | 7:41 PM

Share

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రమ సోలో బాయ్. నవీన్ కుమార్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా హీరోయిన్లుగా నటించారు. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సోలో బాయ్ సినిమా జులై 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజి బిజీగా ఉంటోంది. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ గ్రాండ్ గా జరిగింది. సీనియర్ డైరెక్టర్ వీ వీ వినాయక్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సంగతి పక్కన పెడితే గౌతమ్ కృష్ణ అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాడు. సోలో బాయ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ స్టేజ్ పైనే మురళీ నాయక్‌ కుటుంబానికి లక్ష రూపాయలు గూగుల్‌ పే చేశాడు. అయితే దీనిని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిని గౌతమ్ కృష్ణ తప్పు పట్టాడు. సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన అతను నెటిజన్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

దివంగత జవాన్‌ మురళి నాయక్‌ గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేశాం. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు? అని అంటున్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మురళీ నాయక్ ఫ్యామిలీకి సాయం చేస్తే విమర్శించడం సరికాడు. ఆయనకు డబ్బులు ఇవ్వడంలో తప్పేం ఉంది? మురళీ నాయక్ ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్’ అంటూ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ.

ఇవి కూడా చదవండి

సోలో బాయ్ సినిమా ఈవెంట్ లో గౌతమ్ కృష్ణ

ప్రస్తుతం గౌతమ్ కృష్ణ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మురళీ నాయక్ కుటుంబాన్ని ట్రోల్ చేయడం సరికాదని నెటిజన్లు హీరోకు మద్దతుగా నిలుస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు