Bigg Boss Telugu 10: నవరసాలు పండిస్తున్న ఆ కంటెస్టెంట్.. బిగ్బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్.. వీడియో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోపై మాజీ కంటెస్టెంట్స్, రివ్యూయర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టాప్-5లో ఎవరెవరు ఉంటారో అలాగే విజేత ఎవరన్న దానిపై తమ అంచనాలు చెబుతున్నారు.

అంచనాలకు తగ్గట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఐదు వారాలు కంప్లీట్ చేసుకుంది. ఇక ఆరోవారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఇక మొదటి వారంలో చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీరిలో చరణ్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారను. మూడవ వారం ఎలిమినేషన్ లేకపోయినా వైల్డ్ కార్డు ద్వారా అదే వారం హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన రూ. 15 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఇక నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ కాగా, ఐదవ వారం చరణ్, అపూర్వ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఇక ఆరోవారం ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బిగ్ బాస్ టాప్- 5 కంటెస్టెంట్స్ ఎవరు? కప్పు ఎవరు గెలుస్తారు? అన్న విషయాలపై చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విన్నర్ ఎవరన్నదానిపై ఒక వీడియో రిలీజ్ చేశాడు.
ఈ వీడియోలో మాట్లాడిన కౌశల్ ఇప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 110 విన్నర్ ఎవరో గెస్ చేయడం చాలా కష్టతరమైన విషయం అని తెలిపారు. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఎవరికీ ఎలా కనెక్ట్ అవుతారో ఎవరికి తెలియదని తెలిపారు. అయితే మనం ఏదైనా ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద వచ్చే కామెంట్ల ద్వారా మాత్రం మనం టాప్ ఫైవ్ కంటెస్టెంట్లను గెస్ చేయవచ్చని కౌశల్ అంచనా వేశాడు. ఇటీవల తాను పెట్టిన ఒక వీడియో కింద దాదాపు ఒక వెయ్యి వరకు త్రిగుణ్, రోహిత్ గురించే కామెంట్లు వచ్చాయని రోహిత్ వెల్లడించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్లుగా త్రిగుణ్, రోహిత్ ఉంటారు. హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న త్రిగుణ్ ప్రస్తుతం నవరసాలు పండిస్తూ తనదైన శైలిలోనే దూసుకుపోతున్నాడు. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి అడుగు పెట్టిన రోహిత్ కూడా టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరుగా ఉంటాడు. అయితే రోహిత్ ఇటీవల ఓ లవ్ ట్రాక్ కారణంగా కాస్త లవ్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారేమననిపిస్తోంది. తన సోషల్ లైఫ్ ని కాస్త బ్యాలెన్స్ చేసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రోహిత్ టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటాడు. రోహిత్ ప్రస్తుతం ఆడుతున్న ఆట జీరో. అలాగే తను వెళ్తున్న బాట కూడా జీరో. అయితే ఆయన మాట్లాడుతున్న మాటలు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. హౌస్ లో ఈయన లవ్ ముదరకపోతేనే కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు’ అని కౌశల్ పేర్కొన్నారు.
ఇక టాప్ ఫైవ్ లో భాగంగా మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరు ఉంటారనేది వారి గేమ్ బట్టి తెలుస్తుందని కౌశల్ తెలిపారు. అయితే త్రిగుణ్ రోహిత్ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని కౌశల్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
కౌశల్ మందా వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




