Bigg Boss 10: బిగ్ బాస్ ఇంట్లో టెన్షన్.. ఆమె బ్యాక్ బిచ్చింగ్ స్టార్.. అతను కన్నింగ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికర మలుపులతో సాగుతోంది. సెప్టెంబరు 23వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్ ఎమోషన్లు, వివాదాలు, కామెడీ , సీరియస్ గొడవలతో నిండిపోయింది. ‘టెంప్టేషన్స్ వర్సెస్ టెన్షన్’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లు తమ కుటుంబ సభ్యుల లేఖలు, ఫోటోల కోసం పడిన ఆరాటం ప్రేక్షకులను ఏడిపించేసింది.

Bigg Boss 10: బిగ్ బాస్ ఇంట్లో టెన్షన్.. ఆమె బ్యాక్ బిచ్చింగ్ స్టార్.. అతను కన్నింగ్
Bigboss10

Updated on: Sep 25, 2026 | 7:08 AM

బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య పోటీ, గొడవలు, భావోద్వేగాలు ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఇంటి సభ్యుల ఆటతీరుపై బయట ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయాలను బిగ్ బాస్ స్క్రీన్‌పై చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా షాలినీ, రాం ప్రసాద్, త్రిగుణ్, వర్షిణి, సుధీర్‌లపై వచ్చిన కామెంట్లు ఇంట్లో చర్చకు దారితీశాయి. కెప్టెన్సీ కంటెండర్ టాస్కుల్లో భాగంగా రెండు బజర్‌లను ముందుగా ఎవరు టచ్ చేశారనే దానిపై నరేష్, వంశీ మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని తేల్చే బాధ్యత త్రిగుణ్‌పై పడింది. మొదట నరేష్ ముందుగా బజర్ పట్టుకున్నాడని చెప్పిన త్రిగుణ్.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. చివరకు వంశీనే ముందుగా బజర్ టచ్ చేశాడని ప్రకటించాడు. ఒకవేళ తన నిర్ణయం తప్పయితే దానికి తానే బాధ్యత వహించి పనిష్మెంట్ తీసుకుంటానని త్రిగుణ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరో టాస్క్‌లో వంశీ, ఝాన్సీ పోటీ పడగా.. ఝాన్సీ విజయం సాధించింది. దీంతో ఆమెకు కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచే అవకాశం రావడంతో పాటు ఫ్యామిలీ ఫోటోను పొందే ఛాన్స్ కూడా దక్కింది. అయితే తనకు లభించిన ఆప్షన్స్‌లో నరేష్‌కు సంబంధించిన లెటర్‌ను ఎంచుకున్న ఝాన్సీ.. దాన్ని ముక్కలు చేయడంతో నరేష్‌కు టెన్షన్ మొదలైంది. తర్వాత కంటెస్టెంట్లకు కాస్త రిలీఫ్ ఇచ్చేలా గార్డెన్ ఏరియాలోకి బిగ్ బాస్ భారీగా ఫుడ్ పంపించాడు. ఇంటి సభ్యులంతా కలిసి ఫుడ్‌ను ఎంజాయ్ చేశారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ‘టెంప్టేషన్ అయిపోయింది.. ఇక టెన్షన్ మొదలు’ అంటూ బిగ్ బాస్ ప్రకటించడంతో ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. లివింగ్ ఏరియాలోని స్క్రీన్‌పై ఒక్కో కంటెస్టెంట్ ఆటతీరుపై ప్రేక్షకుల నుంచి వచ్చినట్టుగా కామెంట్లు ప్రత్యక్షమయ్యాయి.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

మొదట ఝాన్సీకి సంబంధించిన కామెంట్లు స్క్రీన్‌పై కనిపించాయి. నామినేషన్స్ సమయంలో ఆమె ఒక ప్రత్యేకమైన షర్ట్‌ను కావాలనే ధరిస్తోందా.? సింపతీ కోసం అలా చేస్తోందా.? ‘రైతు బిడ్డ’ అనే ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోందా.? అనే ప్రశ్నలు కనిపించడంతో ఝాన్సీ ఎమోష్నలైంది. ఇలాంటి అభిప్రాయం తన గురించి చరణ్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రేక్షకుల్లో ఏర్పడి ఉండొచ్చని ఆమె చెప్పింది. ఆ తర్వాత షాలినీకి సంబంధించిన కామెంట్లు రావడంతో ఇంట్లో చర్చ మొదలైంది. ఆమెకు ప్రశాంతత లేదని, మాట్లాడే సమయంలో మాటలు జారుతున్నాయని, ఆలస్యంగా స్పందిస్తోందని కామెంట్లు కనిపించాయి. అంతేకాకుండా ‘బ్యాక్ బిచ్చింగ్ స్టార్’, ‘ట్రిగ్గరింగ్ క్వీన్’ అనే పదాలు స్క్రీన్‌పై కనిపించడంతో షాలినీపై ఫోకస్ పెరిగింది. ఈ కామెంట్లపై ఇంటి సభ్యులు కూడా చర్చించుకున్నారు.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

రాం ప్రసాద్ ఆటతీరుపై వచ్చిన కామెంట్లు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారని, నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతరులపై ఆధారపడుతున్నారని, ‘కన్నింగ్’గా వ్యవహరిస్తున్నారని కామెంట్లు కనిపించాయి. దీంతో రాం ప్రసాద్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. అసలు తనను ‘కన్నింగ్’ అని ఎందుకు అంటున్నారంటూ మిథిలేష్‌ను ప్రశ్నించాడు. త్రిగుణ్ ఆటతీరుపైనా విమర్శలు కనిపించాయి. రోహిత్, ముఖేష్‌లతో వ్యవహరించే సమయంలో అతను ప్రతిసారి ట్రిగ్గర్ అవుతున్నాడని, వారిని అబ్యూజ్ చేస్తున్నాడని, మానిప్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడనే అభిప్రాయాలు స్క్రీన్‌పై కనిపించాయి. దీంతో త్రిగుణ్ కూడా తనపై వచ్చిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. మరోవైపు వర్షిణి విషయంలో ‘ఆట కంటే డ్రామా ఎక్కువ’ అనే తరహా కామెంట్లు కనిపించాయి. ఆమె ముఖేష్, సుధీర్‌లను ప్రభావితం చేస్తోందని, ముఖేష్ తప్పు చేసినా అతని వైపు నిలబడుతోందని కామెంట్స్ వచ్చాయి. ఇక సుధీర్ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్లు కనిపించాయి. సొంతంగా ఆడటం లేదని, స్క్రీన్ స్పేస్ కోసం లవ్ ట్రాక్‌పై ఆధారపడుతున్నాడని, ఇతరుల ప్రభావంలో ఉంటున్నాడనే కామెంట్స్ వచ్చాయి.

హోటల్లో పని చేశాడు.. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నాడు.. కట్ చేస్తే రూ. 2000వేల కోట్లకు అధిపతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us