Sita Ramam: ‘సీతారామం’ సీనియర్ బ్యూటీ.. మరో ముద్దుగుమ్మను పరిచయం చేసిన చిత్రయూనిట్

అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు హన్ను రాఘవపూడి. అందాల రాక్షసి, పడిపడి లేచే మనసు సినిమాలతో ఆకట్టుకున్నాడు.

Sita Ramam: సీతారామం సీనియర్ బ్యూటీ.. మరో ముద్దుగుమ్మను పరిచయం చేసిన చిత్రయూనిట్
Bhumika

Updated on: Jul 21, 2022 | 1:12 PM

అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు హన్ను రాఘవపూడి. అందాల రాక్షసి, పడిపడి లేచే మనసు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు సీతారామం అనే మరో అందమైన ప్రేమ కథతో రాబోతున్నాడు. యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్  గా సీతారామం సినిమా తెరకెక్కుతోంది ‘సీతారామం'(Sita Ramam). దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. అలాగే బాలాజీ పాత్రలో దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నాడు.  తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో మృణాళినిగా భూమిక కనిపించనుంది. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక. ఈ చిత్రంలో ఆమె బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో కనిపించనున్నారు భూమిక. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇవి కూడా చదవండి
Loading...
Unable to load recommendations.
Follow Us