Kalki Ganesh Idol: కల్కి సెట్.. అశ్వత్థామగా వినాయకుడు.. దర్శనం కోసం ఎగబడుతోన్న భక్తులు.. వీడియో చూడండి

|

Sep 09, 2024 | 5:04 PM

ఎప్పటిలానే ఈ వినాయక చవితికి కూడా వివిధ రూపాల్లో గణేశుడు దర్శనమిచ్చాడు. గతంలో బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడి విగ్రహాలు రాగా ఈసారి సలార్, దేవర, పుష్ప, టీ20 ప్రపంచకప్ వినాయక విగ్రహాలు కొలువు తీరాయి. అయితే వీటన్నింటిలో కల్కి వినాయకుడు మరింత స్పెషల్ గా కనిపిస్తున్నాడు

Kalki Ganesh Idol: కల్కి సెట్.. అశ్వత్థామగా వినాయకుడు.. దర్శనం కోసం ఎగబడుతోన్న భక్తులు.. వీడియో  చూడండి
Kalki Ganesh Idol
Follow us on

దేశమంతా వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే ఈ వినాయక చవితికి కూడా వివిధ రూపాల్లో గణేశుడు దర్శనమిచ్చాడు. గతంలో బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడి విగ్రహాలు రాగా ఈసారి సలార్, దేవర, పుష్ప, టీ20 ప్రపంచకప్ వినాయక విగ్రహాలు కొలువు తీరాయి. అయితే వీటన్నింటిలో కల్కి వినాయకుడు మరింత స్పెషల్ గా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, విలన్ సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ అద్భుతంగా నటించారు. ఇందులోని పాత్రలు కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అలాగే ఇదే సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జి కారు కూడా బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాను పోలిన ఓ వినాయక మందిరం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో కల్కి సెట్ లా వినాయక మందిరాన్ని ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా డిజైన్‌ చేశారు. పల కమల్‌ హాసన్‌ పాత్ర బొమ్మ పెట్టి.. శివుడి విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు.

ఈ కల్కి వినాయకుడి విగ్రహం పెట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా డెంకన్ కొట్టాయి అనే ఊళ్ళో ఈ కల్కి సెట్, అశ్వత్థామ వినాయక విగ్రహం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కల్కి సెట్ లో అశ్వత్థామ వినాయకుడు.. ఫుల్ వీడియో ఇదిగో..

 

ఈ వినాయకుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు ఎగబడుతున్నారు. మీరు కూడా కల్కి సెట్, అశ్వత్థామ వినాయకుడి వీడియో చూసేయండి.

భారీగా వస్తోన్న భక్తులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.