
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ మధ్యన పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఘాటీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీని తర్వాతి ప్రాజెక్టు గురించి అనుష్క టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన పెళ్లి రూమర్లతో తరచూ వార్తల్లో నిలుస్తోంది స్వీటీ. గతంలో ఎన్నో సార్లు ఆమె పెళ్లి గురించి ప్రచారం జరిగింది. ఆ బిజనెస్ మ్యాన్ తో పెళ్లి, ఆ హీరో తో వివాహం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు కూడా ఓ బిజినెస్‌మ్యాన్‌ని అనుష్క పెళ్లి చేసుకోనుందని మళ్లీ రూమర్స్ వచ్చాయి. గతంలోనూ ఇలాంటి రూమర్స్ రాగే అనుష్క పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె బాగా సీరియస్ అయ్యింది. ఈ మేరకు అనుష్క పెళ్లిపై వస్తోన్న వార్తలను ఖండిస్తూ ఆమె టీమ్ ఒక నోట్ విడుదల చేసింది.
‘ఒకరి జీవితాన్ని రోజువారీ న్యూస్‌గా మార్చేముందు కనీసం అది నిజమా కాదా అని కూడా చూడటం లేదు. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం, ప్రతి పోస్టులో ’44’ అనే నంబర్‌ని ఏదో వివాదాస్పదమైన అంశంలా హైలైట్ చేయడం అన్నింటికంటే నిరాశ కలిగించే విషయం. వయసు అంత పెద్ద సమస్య అయితే.. హీరోల విషయంలో కూడా అంత ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు? మహిళలకే ఎందుకు భిన్నంగా ఉంటుంది. అనుష్క శెట్టి తన కెరీర్‌ని ప్రతిభ, గౌరవంతో నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదు’.
‘అనుష్క వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలనుకుంటుంది. అలాంటి మహిళను ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతిఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలనీ అందరికీ చెప్పాలనుకోరు. ఆ నిర్ణయాన్ని అందరమూ గౌరవించాలి. వివాహం వ్యక్తిగత విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు. ట్రెండ్ కాదు. కేవలం వ్యూస్ కోసం సెన్సేషనలైజ్ చేయాల్సిన విషయం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. హద్దులని గౌరవించండి. ప్రచురించే ముందు నిజమేదో? అబద్ధమేదో పూర్తిగా నిర్ధారించుకోండి. హీరోయిన్లని కూడా హీరోలతో సమానంగా గౌరవించండి’ అని అనుష్క టీమ్ స్గ్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
#AnushkaShetty Team Slams Marriage Rumours & Media Speculation😳
Anushka’s team has dismissed the marriage rumours calling them baseless and criticizing the spread of unverified news.
They also called out age shaming & reminded that her personal life isn’t for headlines… pic.twitter.com/t41PLC44hH
— The South Cinemaa (@southcinemaaaa) March 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.