Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..

బుల్లితెర బ్యూటీ అనసూయ ఓ వైపు టీవీ షోలతో.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..
Anasuya

Updated on: Jan 15, 2022 | 7:28 PM

Anasuya Bharadwaj: బుల్లితెర బ్యూటీ అనసూయ ఓ వైపు టీవీ షోలతో.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. అందం.. అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై దూసుకుపోతుంది అనసూయ. రంగమ్మత్త పాత్రతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ యాంకరమ్మ. ఇక రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో దాక్షాయణిగా గా నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ లో ను తన సత్తా చాటనుంది.

డ్యాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవా, రెజీనా కాసాండ్ర, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఫ్లాష్‌బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. తెలుగు, తమిళ భాషల్లో డాన్‌ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్ తాజాగా సంక్రాంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఫ్లాష్‌బ్యాక్ టైటిల్ తో తెలుగు – తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో ప్రభుదేవా కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఎదో ఆలోచనలో రెజీనా ఉన్నట్టుగా కనిపిస్తుంటే, అనసూయ ఎదో షాక్ కు గురైనట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అనసూయ గ్లామరస్ పాత్రలో ఆకట్టుకోనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

Bangarraju: నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా పై కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. అన్నయ్య అంటూ..

Swathi Muthyam Glimpse: బెల్లంకొండ చిన్నబాబు సంక్రాంతి ట్రీట్.. స్వాతి ముత్యం నుంచి ఫస్ట్ గ్లిమ్స్..