అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాయల్ వెడ్డింగ్ తరహాలో ముంబైలోని బీకేసీలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ వివాహ వేడుక జరుగుతోంది. అనంత్ రాధిక పెళ్లిలో భారతీయ సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మికత, భారతీయ జానపద కళలు, హస్తకళ, సంగీతం, ఆహారం వంటి అనేక ప్రత్యేకతలు ఉండనున్నాయి. ఇక ఈ పెళ్లి వేడుకకు అతిరహమహారధులు హాజరు అవుతున్నారు.
దేశంలోని అత్యంత సంపన్నుని కుమారుడి వివాహ వేడుకకు వచ్చిన అతిథులు బనారస్ సంప్రదాయ దుస్తుల్లో హాజరుకానున్నారు. పెళ్లి వేడుకల సందర్భంగా పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి అతిథికి భోజనం పూర్తిగా అందించబడుతుంది. వివాహ అతిథులు మొత్తం ఈవెంట్‌ను ఆనందిస్తారు. ఇప్పటికే ఒకొక్కరుగా దేశనలుమూలలనుంచి సెలబ్రిటీలు హాజరవుతున్నారు. అలాగే హాలీవుడ్ నుంచి కూడా పలువురు విచ్చేస్తున్నారు. ఈ వివాహ వేడుకాలో వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రజినీకాంత్ మెరిశారు. అలాగే బాలీవుడ్ తారలు అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, దిశాపటాని,ఏ ఆర్ రెహమాన్, దర్శకుడు అట్లీ, అనన్య పాండే, టైగర్ ష్రాఫ్ అలాగే క్రికెటర్స్ ధోని దంపతులు, హార్దిక్ పాండ్య సందడి చేశారు. వీరితో పాటు హాలీవుడ్ నటుడు డబ్ల్యూ డబ్ల్యూ ఈ రెజ్లర్ జాన్ సీన కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అనంత్ రాధిక వివాహానికి హాజరయ్యే అతిథులకు బనారసీ చాట్, స్వీట్లు, లస్సీ, టీ, ఖారీ, స్ట్రీట్ ఫుడ్ ను ఏర్పాటు చేశారు.
అనంత్, రాధిక పెళ్లి అలంకరణలు ‘యాన్ ఓడ్ టు వారణాసి’ థీమ్‌లో ఉండనున్నాయి. పురాతన నగరమైన వారణాసి సంప్రదాయం, మతం, సంస్కృతి, కళ, హస్తకళలు అలాగే బనారసీ వంటకాలు పెళ్లిలో కనిపిస్తున్నాయి. అతిథులకు బనారసి చాట్, పెర్ఫ్యూమ్ – బ్యాంగిల్స్ షాప్, పప్పెట్ షోతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే అతిథుల కోసం బనారసీ ఆహారాన్ని ఏర్పాటు చేశారు.
#MaheshBabu along with his wife #Namratha, Daughter #Sithara at #AnantAmbani‘s Wedding ! pic.twitter.com/vukbX2xINf
— Rajesh Manne (@rajeshmanne1) July 12, 2024
Super Stunner and Our Very Own Global Star #PriyankaChopra with #NickJonas 🌟@priyankachopra and @nickjonas reached at Jio World Centre, Mumbai to attend #AnantAmbani and #RadhikaMerchant Wedding ceremony.#AnantRadhika https://t.co/zAO6PLzvlL pic.twitter.com/CArt2oyLJx
— Ashwani kumar (@BorntobeAshwani) July 12, 2024
John Cena loves India❤️#JohnCena #AnantAmbani pic.twitter.com/UtiYnuYHzU
— Dr Of Thuganomics (@thuganomics27) July 12, 2024
सिंगर ए.आर.रहमान पत्नी साईरा बानू संग अनंत अंबानी-राधिका मर्चेंट की शादी में शामिल होने मुंबई के जियो वर्ल्ड कन्वेंशन सेंटर पहुंचे। #ARRahman @arrahman #AnantAmbani #AnantRadhikaWedding #JioworldCentre #AnantRadhikaCelebration #RadhikaMerchant #MukeshAmbani #NitaAmbani pic.twitter.com/75Ga3SracD
— Veer Arjun (@VeerArjunDainik) July 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.