Pushpa The Rise : అల్లు అర్జున్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. తెలంగాణలో పుష్ప సినిమాకు 5 షోలు.. ఎప్పటివరకు అంటే

|

Dec 16, 2021 | 3:53 PM

Pushpa The Rise : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు.

Pushpa The Rise : అల్లు అర్జున్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. తెలంగాణలో పుష్ప సినిమాకు 5 షోలు.. ఎప్పటివరకు అంటే
Follow us on

Pushpa: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు  సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. డిసెంబర్ 17న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలంగాణలు పుష్ప సినిమా 5 షోలు వేయనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రేపు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇక తెలంగాణలో రోజులు 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ నెల 30 వరకు పుష్ప సినిమా 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

పుష్ప సినిమాకు ఈ నెల 30 వరకు తెలంగాణ ప్రభుత్వం 5 షోలకు అనుమతి ఇవ్వడంతో బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన పుష్ప సినిమాను మైత్రమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసి సినిమా పై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి ఇక రేపు ( డిసెంబర్ 17న) థియేటర్స్ దగ్గర జాతర చేయడానికి బన్నీ ఆర్మీ సిద్ధం అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: The Rise : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారా..! సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.. యూఏఈ నుంచి పుష్ప ఫస్ట్ రివ్యూ..

Pushpa Movie: బన్నీ సాహసాన్ని మెచ్చుకుంటున్న సినీ విశ్లేషకులు.. పుష్పరాజ్‌‌కు పాత్రను న్యాయం చేశాడంటూ..!!