Allu Arjun : అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

|

Dec 30, 2024 | 12:50 PM

అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌పై  ఉన్న విషయం తెలిసిందే. 

Allu Arjun : అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
Allu Arjun
Follow us on

అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌పై  ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో ప్రీమియర్స్ వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయ్యింది. ఒక మహిళా ప్రాణాలు కోల్పోవడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యేరు.

పోలీసులు కూడా థియేటర్ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు డిసెంబర్‌ 13న 14 రోజుల రిమాండ్‌ విధించింది నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వొకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చంచల్‌గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్‌ ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలో కోర్టుకు హాజరై.. హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిపారు అల్లు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ అడ్వకేట్లు నాంపల్లి కోర్టులో సైతం రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దానిపై నాంపల్లి కోర్టు విచారణ జరిపి.. తాజాగా జనవరి3 వాయిదా వేసింది.

అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు: 

సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదు. BNS సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఇచ్చిందన్న న్యాయవాది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయ్యాలని కోరారు న్యాయవాది..

పబ్లిక్ ప్రాసుక్యూటర్ వాదనలు : 
రేవతి మృతికి అల్లు అర్జున్ ఏ ప్రధాన కారణం. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తాడు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు సహకరించడు..
అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని కొట్టివేయాలి..