AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరుగురు పతివ్రతలు సినిమా ఇప్పటిరకు చూడలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

అల్లరి నరేష్ తన కెరీర్ ప్రయాణం గురించి, పెద్ద సినిమాలతో పోటీగా తన చిత్రాలు విడుదల కావడం గురించి వివరించారు. తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆరుగురు పతివ్రతలు సినిమా కథ తనకు నచ్చలేదని, ఇప్పటివరకు ఆ సినిమా చూడలేదని తెలిపారు. భవిష్యత్తులో ఈవీవీ సినిమా బ్యానర్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను వెల్లడించారు.

ఆరుగురు పతివ్రతలు సినిమా ఇప్పటిరకు చూడలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
Allari Naresh
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2026 | 12:41 PM

Share

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ తన కెరీర్, వ్యక్తిగత అభిప్రాయాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యే సమయంలోనే తన సినిమాలు కూడా విడుదలై విజయం సాధించడం గురించి, తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆరుగురు పతివ్రతలు సినిమా పట్ల తన అసంతృప్తి గురించి నరేష్ మాట్లాడారు. జనరల్‌గా పండగల సీజన్‌లో, సమ్మర్‌లో ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయని, ఆ సమయంలోనే తన చిత్రాలు కూడా విడుదలవుతాయని నరేష్ వివరించారు. మగధీర వంటి పెద్ద చిత్రంతో పాటు బెండ అప్పారావు R.M.P విడుదల కావడం, భీష్మతో పాటు నాంది, పైసా వసూల్ వంటి చిత్రాలతో నేను విడుదల కావడం యాదృచ్చికమేనని అన్నారు. కావాలని పెద్ద సినిమాలతో పోటీపడటం చిన్న చిత్రాలకు నష్టమని, అయితే కొన్నిసార్లు అనుకున్న తేదీకి కట్టుబడటం వల్ల ఇలాంటివి జరుగుతాయని ఆయన తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు..

సుడిగాడు చిత్రంలో “ఇంకి పింకి పాంకి” పాట పాడిన అనుభవాన్ని నరేష్ పంచుకున్నారు. అయితే, తాను గాయకుడిగా మారాలనుకోవడం లేదని, తన స్వరం డబ్బింగ్, వాయిస్ ఓవర్స్‌కి మాత్రమే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా డబ్బింగ్ చెప్పమని అడిగితే కుదరలేదని, నటుడిగా ఎవరికీ డబ్బింగ్ చెప్పలేదని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Allari Naresh: అతడు ఒక కంప్లీట్ యాక్టర్.. డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు.. అల్లరి నరేష్.

తన తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలలో హలో బ్రదర్ తనకిష్టమైన సినిమా అని అల్లరి నరేష్ తెలిపారు. అయితే, ఆరుగురు పతివ్రతలు సినిమా కథ తనకు మొదటినుంచీ నచ్చలేదని, ఇప్పటివరకు ఆ సినిమా చూడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆరు వేర్వేరు కథలతో కూడిన ఈ చిత్రంలో ఒక ఫ్లో ఉండదని, సీరియల్ చూసినట్లు ఉంటుందని అప్పట్లోనే తండ్రికి చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా విడుదల సమయంలో చాలా దుమారం రేగిందని కూడా ఆయన ప్రస్తావించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

అల్లరి నరేష్.. 

Allari Naresh Movies

Allari Naresh Movies

ఎక్కువమంది చదివినవి : Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..

Follow Us