RRR : అలియా భట్ హైదరాబాద్ వచ్చేస్తోంది!

రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న తెరకెక్కిస్తోన్న సంచలన మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి సిరీస్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా అవ్వడం..ఇండస్ట్రీ అగ్ర హీరోలు నటిస్తుండటంతో

RRR :  అలియా భట్ హైదరాబాద్ వచ్చేస్తోంది!
Follow us

|

Updated on: Oct 29, 2020 | 4:33 PM

రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న తెరకెక్కిస్తోన్న సంచలన మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి సిరీస్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా అవ్వడం..ఇండస్ట్రీ అగ్ర హీరోలు నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి పున: ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీన విడుదల చేసిన రామ రాజు ఫర్ భీమ్ టీజర్ యూట్యూబ్‌లో ప్రకంపనలు స‌ృష్టిస్తోంది.

అయితే టీజర్ చివర్లో కొమరం భీమ్‌ను ముస్లిం గెటప్‌లో చూపించడంతో వివాదం రాజుకుంది. రాజమౌళి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీశారని, ఆ సీన్లు తొలగించాలని..లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే రాజమౌళి ఈ వివాదాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.‌ ఇందులో సీత పాత్రలో నటించనున్న అలియా భట్ త్వరలోనే యూనిట్‌తో జత కలవనున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఆమె నవంబర్ 2 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఇందులో సీత పాత్ర చిన్నదే అయినప్పటికీ పాన్ ఇండియా సినిమా కావడంతో నిండుదనం కోసం అలియా భట్‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్‌ జోడీగా ఒలివియా మోరిస్‌ నటిస్తోంది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read :…

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

అప్పట్లో పెళ్లి చేసుకుంటే దేవుడికి కూడా కట్నం ఇచ్చేవారట !

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..