AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dacoit Movie: అడివి శేష్ సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్లు.. రెండు రోజుల్లో డెకాయిట్‌కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ల లోనూ జోరు చూపిస్తుంది. తాజాగా ఈ సినిమా రెండు రోజుల వసూళ్లకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.

Dacoit Movie: అడివి శేష్ సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్లు..  రెండు రోజుల్లో డెకాయిట్‌కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Adivi Sesh Dacoit Movie
Basha Shek
|

Updated on: Apr 12, 2026 | 1:04 PM

Share

టాలీవుడ్‌ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్‌ నటించిన చిత్రం డెకాయిట్‌.షానియల్‌ డియో తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లవ్ స్టోరీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. కంటెంట్ పరంగా కొంచెం వీక్ గా ఉన్నా సినిమాలోని ట్విస్టులు బాగున్నాయని, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయని ప్రేక్షకులు అంటున్నారు. రివ్యూలు కూడా ఈ సినిమాకు పాజిటివ్ గానే వచ్చాయి. దీంతో మొదటి రోజే డెకాయిట్ సినిమాకు రూ. 15 కోట్ల వసూళ్లు వచ్చాయి. తద్వారా అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా డెకాయిట్ నిలిచింది. ఇక రెండో రోజు కూడా అదే రేంజ్‌లో సత్తా చాటింది డెకాయిట్.మొత్తానికి ఈ చిత్రం రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇక ఓవర్సీస్ లోనూ డెకాయిట్ కు మంచి వసూళ్లు వస్ఉతన్నాయి. ఉత్తర అమెరికాలో అయితే ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటింది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్‌ మరింత పెరగవచ్చని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. కాగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసిస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని , రాహుల్ రవీంద్రన్ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి చిత్ర బృందాన్ని అభినందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్ సంయుక్తంగా ‌ నిర్మించిన డెకాయిట్ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్‌ కశ్యప్ విలన్ గా నటించాడు. ‌ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల, జైయన్ మేరీ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు స్వరాలందించారు.

ఇవి కూడా చదవండి

రెండు రోజుల్లో 28 కోట్లకు పైగా కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్