AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avika Gor: పెళ్లిపీటలెక్కన ‘చిన్నారి పెళ్లి కూతురు’.. గ్రాండ్ వెడ్డింగ్ వీడియో వైరల్.. వరుడు ఎవరంటే?

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ముంబై వేదికగా మంగళవారం (సెప్టెంబర్ 30) ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Avika Gor: పెళ్లిపీటలెక్కన 'చిన్నారి పెళ్లి కూతురు'.. గ్రాండ్ వెడ్డింగ్ వీడియో వైరల్.. వరుడు ఎవరంటే?
Avika Gor Marriage
Basha Shek
|

Updated on: Sep 30, 2025 | 7:26 PM

Share

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో చిన్నప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యింది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాల అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ, రాజుగారి గది 3, థ్యాంక్యూ తదితర సినిమాల్లో కథానాయికగా మెప్పించింది. పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ కన్నడ, హిందీ లో కూడా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది అవికా గోర్. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అందాల తార గత ఆరేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో మునిగితేలుతోంది. తమ ప్రేమ విషయాన్ని కూడా ఎప్పుడో అధికారికంగా ప్రకటించారీ లవ్ బర్డ్స్. ఇక ఈ ఈ ఏడాది జూన్ లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) అవిక- మిలింద్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం అవికా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లి వేడుకలో అవికా గోర్ డ్యాన్స్.. వీడియో..

2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్‌ని ఓ సందర్భంలో కలిసింది అవికా. అప్పటి నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ తర్వాత ఇద్దరి అభిరుచులు, మనసులు కలవడంతో ప్రేమికులుగా మారిపోయారు. 2020 నుంచి ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం షణ్ముఖ అనే సినిమాలో నటిస్తోంది అవికా గోర్. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..