Vijay Deverakonda: ‘తప్పుల నుంచి నేర్చుకోవాలి.. విజయాన్ని ఎంజాయ్ చేయండి’.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

|

Sep 20, 2022 | 8:07 PM

కొత్త నైపుణ్యాలు నెర్చుకోండి. తప్పుల నుంచి నేర్చుకోండి. విజయాన్ని ఎంజాయ్ చేయండి. మీకు కావాల్సిన జీవితాన్ని గడపేయండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు విజయ్.

Vijay Deverakonda: తప్పుల నుంచి నేర్చుకోవాలి.. విజయాన్ని ఎంజాయ్ చేయండి.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Vijay Deverakonda
Follow us on

తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా లైగర్ (Liger). ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‏గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. అయితే సినిమా విడుదల అనంతరం కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విజయ్.. తాజాగా వీడియో షేర్ చేస్తూ.. అభిమానుల్లో స్పూర్తినింపేలా క్యాప్షన్ ఇచ్చారు. తాను లైగర్ కోసం వర్కవుట్స్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. “కష్టపడి పనిచేయండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. కొత్త నైపుణ్యాలు నెర్చుకోండి. తప్పుల నుంచి నేర్చుకోండి. విజయాన్ని ఎంజాయ్ చేయండి. మీకు కావాల్సిన జీవితాన్ని గడపేయండి” అంటూ క్యాప్షన్ ఇచ్చారు విజయ్.

లైగర్ సినిమా కోసం విజయ్ చాలానే కష్టపడ్డాడు. ఇందులో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అథ్లెట్ గా కనిపించాడు. ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తు్ండగా. సమంత కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.