
దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే మెప్పిస్తున్న యంగ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసినప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. సౌత్ లో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ప్రేమలో పడిపోయింది. ఈ మేరకు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఓ ఫోటోను ఆమె షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే అండి .. హీరోయిన్ తాన్య రవిచంద్రన్. సినిమా కుటుంబం నుంచి వచ్చిన తాన్య 2016లో ఇండస్ట్రీలోకి కథానాయికగా అరంగేట్రం చేసింది.
తమిళ్ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్. తమిళంలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. కార్తికేయ నటించిన రాజా విక్రమార్క సినిమాతో 2021లో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లెలి పాత్రలో కనిపించింది. ఈ సినిమా తర్వాత పూర్తిగా తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది తాన్య. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 29 సంవత్సరాలు. తాజాగా ఈ బ్యూటీ ప్రేమలో పడిపోయినట్లు తెలిపింది.
తన ప్రియుడికి కిస్ ఇస్తూ దిగిన ఫోటోను షేర్ చేసింది. కానీ అతడికి సంబంధించిన వివరాలు మాత్రం షేర్ చేయలేదు. అలాగే అతడి ఫేస్ కూడా రివీల్ చేయలేదు తాన్య. ఇక ఇదే ఫోటోను సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్ సైతం షేర్ చేశారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం లారెన్స్ నటిస్తోన్న బెంజ్ ప్రాజెక్ట్ కోసం కెమెరామెన్ గా గౌతమ్ జార్జ్ పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..