Tanya Ravichandran: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా..? అభిమాని ప్రశ్నకు తలపట్టుకున్న హీరోయిన్..

|

May 10, 2024 | 2:54 PM

ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్. ఆయన వారసత్వంతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2017లో విడుదలైన "పాలే విల్లియతేవా" సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ మూవీ తర్వాత బృందావనం, కరుప్పన్, నెంచుకు నీతి, మాయోన్, అఖిలన్ వంటి చిత్రాల్లో నటించారు. విజయ్ సేతుపతికి జోడీగా కరుప్పన్ సినిమాలో నటించి ఫేమస్ అయింది తాన్య.

Tanya Ravichandran: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా..? అభిమాని ప్రశ్నకు తలపట్టుకున్న హీరోయిన్..
Tanya Ravichandran
Follow us on

సాధారణంగా సినీ ప్రమోషన్స్.. ప్రెస్ మీట్లలో హీరోయిన్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు అభిమానులు ప్రవర్తన.. మరికొన్నిసార్లు ఊహించని ప్రశ్నలతో షాకిస్తుంటారు. ఇక ఫ్యాన్స్ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎదుర్కోన్నారు. తాజాగా మరో కథానాయికకు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి వచ్చింది. తాన్యా రవిచంద్రన్. తెలుగులో ఈ అమ్మడు అంతగా ఫేమస్ కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లిగా కనిపించింది. ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్. ఆయన వారసత్వంతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

2017లో విడుదలైన “పాలే విల్లియతేవా” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ మూవీ తర్వాత బృందావనం, కరుప్పన్, నెంచుకు నీతి, మాయోన్, అఖిలన్ వంటి చిత్రాల్లో నటించారు. విజయ్ సేతుపతికి జోడీగా కరుప్పన్ సినిమాలో నటించి ఫేమస్ అయింది తాన్య.

ప్రస్తుతం తాన్య రవిచంద్రన్ రసవాది అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాన్య ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇటీవల ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించింది. తన సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే సమయంలో ఓ అభిమాని తనను విచిత్రమైన ప్రశ్న అడిగారని తెలిపింది. ” నన్ను పెళ్లి చేసుకుంటున్నావా అక్కా.. ” అని అడిగాడు. అతను అడిగిన ప్రశ్న తనకు అర్థం కాలేదని.. అక్కా.. పెళ్లి అంటూ రెండూ సంబంధం లేకుండా మాట్లాడాడని తెలిపింది. అతడి ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాలేదని తెలిపింది. ఇప్పటికీ ఆ ఘటన గుర్తుకు వస్తే నవ్వొస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాన్య నటించిన రసవాది చిత్రానికి డైరెక్టర్ శాంతకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో అర్దున్ ధాస్ కథానాయకుడిగా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.