Jabardasth: జబర్దస్త్‌కు మళ్లీ కళ వచ్చింది.. రీఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ.. ప్రోమోతోనే కట్టిపడేసిందిగా..

జబర్దస్త్ లో రీఎంట్రీల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా ఉంటోన్న ఆర్టిస్టులు మళ్లీ ఈ కామెడీ షోలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా ఒక లేడీ కమెడియన్ మళ్లీ ఈ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

Jabardasth: జబర్దస్త్‌కు మళ్లీ కళ వచ్చింది.. రీఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ.. ప్రోమోతోనే కట్టిపడేసిందిగా..
Jabardasth Comedy Show

Updated on: Oct 21, 2026 | 3:21 PM

మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలోకి వచ్చాక.. పాత టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు, ఆర్టిస్టులు మళ్లీ తిరిగి కామెడీ షోలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమాల్లో బిజీ బిజీగా ఉంటోన్న హైపర్ ఆది, ధనాధన్ ధన్‌రాజ్,సుడిగాలి సుధీర్, చలాకీ చంటి, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి స్టార్ కమెడియన్లతో పాటు సద్దాం, వినోద్ అలియాస్ వినోదిని తదితరులు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీచ్చారు. వీరిలో కొందరు రెగ్యులర్ గా జబర్దస్త్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరికొందరు గెస్టులుగా వచ్చి ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ రీఎంట్రీల జాబితాలోకి ఒక లేడీ కమెడియన్ కూడా చేరింది. ఆమె మరెవరో కాదు సత్యశ్రీ. తాజాగా రిలీజైన ప్రోమోలో ఈ గ్లామరస్ బ్యూటీ సందడి చేసింది. ధనాధన్ ధన్ రాజ్ తో కలిసి స్కిట్స్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా జబర్దస్త్ కామెడీ షోలోకి లేడీ కమెడియన్ల ఎంట్రీ సత్య శ్రీ తోనే మొదలైందని చెప్పవచ్చు. అంతకు ముందుఆమె పలు సీరియల్స్, సినిమాల్లో యాక్ట్ చేసింది. ‘రాజా ది గ్రేట్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘సిల్లీ ఫెలోస్‌’, ‘ఎఫ్ 3’, ‘రారండోయ్‌ వేడుక చేద్దాం’ తదితర సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది సత్యశ్రీ. ఈ క్రేజ్ తోనే జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ కు ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే చమ్మక్‌ చంద్రకి సినిమా ఆఫర్లు రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశాడు. ఆయనతో పాటే సత్యశ్రీ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది.

జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసిన తర్వాత చమ్మక్‌ చంద్రతో కలిసి ‘అదిరింది’ అనే షోలో చేసింది సత్యశ్రీ. అలాగే సినిమాల్లోనూ బిజీ అయిపోయింది. కమెడియన్ గానూ, సహాయక నటిగానూ రాణిస్తోంది. ఆ మధ్యన నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సత్య శ్రీ చేసిన స్పెషల్ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ సాంగ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ ఏడాదికి సంక్రాంతికి రిలీజైన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలోనూ హీరోయిన్ ఫ్రెండ్ గా చేసింది సత్యశ్రీ. ప్రస్తుతం సత్యశ్రీ ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే వెబ్ సిరీస్ లో ఓ నటించింది. ఈ సిరీస్ రేపు (అక్టోబర్ 22) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది .దీంతో పాటు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ సత్యశ్రీ లేటెస్ట్ ఫొటోస్..

మరి జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సత్యశ్రీ కంటిన్యూస్ గా చేస్తుందా? లేక కేవలం గెస్టుగానే వచ్చిందా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us