Vijay Devarakonda: మరోసారి హిట్ కాంబో రిపీట్.. విజయ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ ?..

|

Jul 05, 2022 | 8:24 AM

బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా..అతనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

Vijay Devarakonda: మరోసారి హిట్ కాంబో రిపీట్.. విజయ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ ?..
Rashmika Vijay
Follow us on

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా..అతనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే.. పూరి, విజయ్ కాంబోలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అదే జనగణమన.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఇందులో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే నెట్టింట పలు అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని టాక్. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ లో రష్మిక మందన్న నటించనుందని టాక్ వినిపిస్తోంది. రష్మిక, విజయ్ కాంబోలో స్పెషల్ సాంగ్ వస్తే ఈ సినిమాపై ఫుల్ హైప్ వస్తోందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరీ నిజంగానే వీరిద్దరి కాంబోలో స్పెషల్ సాంగ్ ఉందా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.