నా బట్టలు.. నా శరీరం.. నా ఇష్టం..! మీ పని మీరు చూసుకోండి..!! బాడీ షేమింగ్‌పై టాలీవుడ్ స్ట్రాంగ్ కౌంటర్

సోషల్ మీడియాలో ఎవరి వ్యక్తిగత జీవితాన్ని అయినా విమర్శించే ముందు బాధ్యతగా వ్యవహరించాలనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. సినీ తారలు ఏ దుస్తులు ధరించినా, ఎలా కనిపించినా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం, వారి ఫొటోలు, వీడియోలను సందర్భం లేకుండా వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది .

నా బట్టలు.. నా శరీరం.. నా ఇష్టం..! మీ పని మీరు చూసుకోండి..!! బాడీ షేమింగ్‌పై టాలీవుడ్ స్ట్రాంగ్ కౌంటర్
Actress

Updated on: Oct 21, 2026 | 8:48 AM

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతి, వ్యక్తిగత జీవితం గురించి కొందరు నెటిజన్లు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ హద్దులు దాటుతున్నారు. తాజాగా ఇలాంటి బాడీ షేమింగ్‌పై టాలీవుడ్ హీరోయిన్ ఘాటుగా స్పందించింది. తన శరీరం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలను వైరల్ చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నా శరీరం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆమె.. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. పాయల్ రాజ్‌పుత్ పేరుతో ఎక్స్‌ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. “మీకు సిగ్గుండాలి. నా శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఆ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజ్, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు లేదా మీ అశ్లీలతకు సంబంధించిన విషయాలు కావు. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పని మీరు చూసుకోండి” అని చెప్పుకొచ్చింది.

పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి. 2017లో విడుదలైన ‘చన్నా మేరేయా’ సినిమాతో పంజాబీ ప్రేక్షకులకు చేరువయ్యింది. 2018లో విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా పాయల్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. కార్తికేయ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇందు పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో పాయల్‌కు తెలుగులో విపరీతమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. 2023లో విడుదలైన ‘మంగళవారం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంలో పాయల్ నటనకు ప్రశంసలు లభించాయి.

ఇవి కూడా చదవండి

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ పాయల్ రాజ్‌పుత్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తన ఫొటోలు, సినిమా విశేషాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆమె అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే సోషల్ మీడియా వేదికగా వచ్చే విమర్శలు, ట్రోలింగ్ విషయంలో సెలబ్రిటీలకు ఎదురవుతున్న ఇబ్బందులు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన ఈ పోస్ట్ కూడా ఇదే అంశంపై చర్చకు దారితీస్తోంది.

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us