Nabha Natesh: ఈ దసరాకి నా ఆయుధ పూజ వీటికే.. హీరోయిన్ నభా నటేష్ పోస్ట్ వైరల్

యాక్సిడెంట్ కారణంగా చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న నభా నటేష్ మళ్లీ బిజీ గా మారిపోయింది. వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'స్వయంభు' అనే పాన్ ఇండియా సినిమాతో పాటు ఓ కన్నడ సినిమా కూడా ఉంది

Nabha Natesh: ఈ దసరాకి నా ఆయుధ పూజ వీటికే.. హీరోయిన్ నభా నటేష్ పోస్ట్ వైరల్
Actress Nabha Natesh

Updated on: Oct 20, 2026 | 11:41 AM

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గత 9 రోజులుగా నవరాత్రి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నాయి. ఇక విజయదశమి పర్వదినం సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఆయుధ పూజ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ తన ఆయుధ పూజకు సంబంధించి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 2018లో వచ్చిన నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నభా నటేష్. అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో నటించిన ఆమె తెలుగు సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా నభా నటేష్ కు మంచి క్రేజ్, పాపులారిటీ తీసుకొచ్చింది. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో ఇలా పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది నభా. తనదైన అందం, అభినయంతో తెలుగు నాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అయితే హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్పీడ్ ఉంటున్న తరుణంలోనే నభాకు యాక్సిడెంట్ అయ్యింది. దీంతో చాలా నెలల పాటు మంచానికే పరిమితమైందీ అందాల తార.

ఇక గతేడాదే డార్లింగ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. అలాగే ఈ ఏడాది నాగబంధం అనే పాన్ ఇండియా మూవీలోనూ కథానాయికగా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్ధ్ సరసన స్వయంభు సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కన్నడలోనూ ఓ సినిమా చేస్తోందీ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నభా నటేష్. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా విజయదశమి ఆయుధ పూజను పురస్కరించుకుని నభా నటేష్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జిమ్‌లో వర్కవుట్స్ చేసే డంబెల్స్, ఇతర ఎక్విప్‌మెంట్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆమె.. హ్యాపీ ఆయుధ పూజ అని అభిమానులకు విషెస్ చెప్పింది. నా ఆయుధ పూజ వీటికే చేశాను అనే అర్ధం వచ్చేలా ఉన్న ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నభా నటేష్ పోస్ట్..

Nabha Natesh

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us