Mrunal Thakur : ఈ పాత్ర నాకన్నా ఎవ్వరూ బాగా చేయలేరు.. ఎమోషనల్ అయిన మృణాల్
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మృణాల్ క్రేజ్ ను కూడా అదే రేంజ్ లో సొంతం చేసుకుంది. సీతారామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ కు తెలుగులో మంచి ఆదరణ లభించింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించిన మృణాల్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సీతారామం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వాత హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను అలరించింది మృణాల్.

తెలుగు ఇండస్ట్రీకి బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ వచ్చిన విషయం తెలిసిందే. హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మృణాల్ క్రేజ్ ను కూడా అదే రేంజ్ లో సొంతం చేసుకుంది. సీతారామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ కు తెలుగులో మంచి ఆదరణ లభించింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించిన మృణాల్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సీతారామం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను అలరించింది మృణాల్. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. హాయ్ నాన్న సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది.
విజయ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ నటిస్తుంది. ఈ సినిమాతో మృణాల్ హ్యాట్రిక్ సాదించబోతుంది. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. మృణాల్ మాట్లాడుతూ..
నన్ను ఇంతగా ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు.. నన్ను మీరందరూ మీ తెలుగమ్మాయిగా ఆదరించారు. కాబట్టే నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ప్రేమను మీరు నాపైన చూపిస్తున్నారు. తెలుగు వారందరికీ ధన్యవాదాలు.. అని ఎమోషనల్ అయ్యింది మృణాల్. అలాగే ఈ సినిమాలో ఇందు అనే పాత్రలో నటిస్తున్నా.. మొదటి 15 రోజులు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ తర్వాత ఈ పాత్ర నాకన్నా ఎవ్వరూ బాగా చేయలేరు అని అనిపించింది. విజయ్ తో సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు.. ఫ్యామిలీ స్టార్ సినిమాతో నాకు ఆ అవకాశం దక్కింది అని తెలిపింది మృణాల్. ఈ సినిమా తర్వాత మృణాల్ కు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
Taking Bow Head!!
Thank you audiences, you all made me Telugu Ammai 😍 – #MrunalThakur #FamilyStar #VijayDeverakonda pic.twitter.com/faUXdZdUtz
— Telugu Bit (@telugubit) April 2, 2024
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.