Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

మీరా మిథున్.. తమిళ హీరోయిన్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ..

Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..
Meera

Updated on: Aug 13, 2021 | 2:58 PM

Meera Mitun : మీరా మిథున్.. ఈ తమిళ హీరోయిన్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది. తాజాగా దళిత సినిమా కార్మికులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి హాట్‌‌‌టాపిక్‌‌‌గా మారింది. దళిత దర్శకులు, దళిత ఆర్టిస్టులకారణంగానే తనకు సినిమా అవకాశాలు తగ్గాయని ఆరోపించింది. దాంతో ఒక్కసారిగా దుమారం రేగింది. మీరా మిథున్ పై సోషల్ మీడియాలో.. బయట విమర్శలు వెల్లువెత్తాయి. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు… మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మీరా మిథున్ విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపారు.

అయితే విచారణకు మీరా మిథున్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోలీసుల నోటీసులను లెక్క చేయలేదు. దాంతో ఆమెను ఏక్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో మీరా మిథున్ ఖాయం అంటూ పోస్ట్‌‌‌‌లు హల్‌‌‌‌చల్ చేశాయి. ఈ విషయం పై మీరా మిథున్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఆమె మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను పోలీసులు అరెస్ట్ చేయడం జరగదని.. అది అసాధ్యం అని రాసుకొచ్చింది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుందని సంచలన కామెంట్లు చేసింది మీరా మిథున్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

Sridevi Birthday: జాన్వీని తక్కువగా అంచనా వేసిన శ్రీదేవి.. హీరోయిన్ కావాలనుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా..

Follow Us