Tollywood : నా భర్తే నన్ను చంపాలి అనుకున్నాడు.. అలాంటి సినిమాల్లో నటించడానికి కారణం అదే.. టాలీవుడ్ నటి..

సినీరంగంలో సహయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టులకే ఫాలోయింగ్ ఉండేది. గ్లామరస్ లుక్స్ లో అందం, అభినయంతో ఆకట్టుకునేవారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి ఒకరు. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.

Tollywood : నా భర్తే నన్ను చంపాలి అనుకున్నాడు.. అలాంటి సినిమాల్లో నటించడానికి కారణం అదే.. టాలీవుడ్ నటి..
Jayalalitha

Updated on: May 25, 2026 | 8:26 AM

నటి జయలలిత తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సంవత్సరాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత సంక్లిష్ట సంఘటనలను పంచుకున్నారు. ఆమె మలయాళం దర్శకుడితో తన ప్రేమ, వివాహం, ఆ తర్వాత అనుభవించిన కష్టాల గురించి వివరించారు. ప్రేమలో పడిన పరిస్థితులను వివరిస్తూ, క్రాస్ బెల్ట్ మణి అనే వ్యక్తి నుండి రౌడీయిజం బెదిరింపులు ఎదురైనప్పుడు, ఆ దర్శకుడు తనకు అండగా నిలిచారని, దాంతో ఆయన ప్రేమలో గుడ్డిగా పడిపోయానని తెలిపారు. ఏడేళ్ళ బంధంలో నెమ్మదిగా అతని గురించి తెలిసివచ్చినా, మొహమాటం కారణంగా బంధాన్ని కొనసాగించాల్సి వచ్చిందన్నారు. చివరికి, అతను రక్తం లేఖలు రాసి, విషం తాగి చచ్చిపోతానని బెదిరించడంతో, కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా, సొంత ఖర్చులతో నగలు, పెళ్లి బట్టలు కొనుక్కుని, కేరళలోని చోటానిక్కర అమ్మవారి గుడిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత, ఆమెను కాపురానికి పంపించడానికి ఎవరూ రాలేదని, ఒంటరిగానే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

వివాహం తర్వాత ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని జయలలిత తెలిపారు. భర్తకు అప్పులు ఎక్కువై, విపరీతమైన ఖర్చులు ఉండేవని, తన మూడు షిఫ్టుల సంపాదన మొత్తం వారే తీసుకునేవారని, తన నగలు కూడా అమ్మేసుకున్నారని పేర్కొన్నారు. అమ్మానాన్న ఆమెకు ఆస్తి ఇవ్వకుండా అడ్డుకున్నారని, అప్పుడు ఆమెకు బిడ్డలు వద్దని లేడీ డాక్టర్ వద్దకు వెళ్లి గర్భనిరోధక పిల్స్ తీసుకున్నానని వెల్లడించారు. మూడో నెల నుంచి గొడవలు, ఆరో నెల నుంచి కొట్టుళ్లు, యాసిడ్ పోస్తానని బెదిరించడం, గదిలో బంధించడం వంటి వేధింపులు ఎదురయ్యాయని వివరించారు. ఒక రోజు, ఆమెను అంబాసిడర్ కారులో హత్య చేయడానికి తీసుకెళ్తుండగా, నిలువెత్తు బాబా కాషాయ వస్త్రాల్లో వచ్చి, ఆమె కారు తలుపు తీసి బయటికి లాక్కెళ్లారని, అది తనకు పునర్జన్మ అని ఆమె నమ్మినట్లు తెలిపారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో, ఆమె సోదరులు పరచూరి గోపాలకృష్ణ , చలపతి రావు విరుగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి ఆమెను రక్షించాల్సిందిగా కోరగా, పోలీసులు ఆమెను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. ఇది దైవ సంకల్పంగా, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా ఆమె భావించారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

ఈ సంఘటనల తర్వాత కూడా, తన మాజీ భర్త రమ్యకృష్ణతో నీలాంబరి సినిమా చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి, నడుము వద్ద పడిపోవడంతో, నెలకు 5,000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం పంపించేదాన్ని అని జయలలిత తన మానవత్వాన్ని చాటుకున్నారు. అతనితో తనకు రుణానుబంధం ఉందని అన్నారు. ఆ తర్వాత అతనికి వేరే పెళ్లి జరిగి, ఒక పాప పుట్టిందని, చాలా సంవత్సరాల వరకు ఆ పాప పుట్టినరోజులకు బహుమతులు పంపించేదాన్ని అని తెలిపారు. అయితే, ఇప్పుడు ఆ కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

తిరిగి వచ్చిన తర్వాత తన పుట్టింటివారు సంతోషించారని, కానీ పుట్టింటివారు, అత్తింటివారు కూడా తనను ఒక ఏటీఎం మెషీన్‌లా చూశారని అన్నాపు. అప్పుడు తనకు ఈ విషయాలు తెలిసే జ్ఞానం లేదని, తన అజ్ఞానమే తనను కాపాడిందని తెలిపారు. కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే సినిమాల్లో వచ్చిన పాత్రను చేసినట్లు తెలిపారు.

Jayalalitha News

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

Follow Us