Kushi Movie: పవన్ కళ్యాణ్ బ్యూటీఫుల్ లవ్‏స్టోరీకి 21 ఏళ్లు.. ఖుషి నమ్మశక్యం కానీ ప్రయాణమంటూ భూమిక పోస్ట్..

|

Apr 27, 2022 | 11:36 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‏లోనే అందమైన ప్రేమకథా చిత్రం ఖుషి (Kushi). ఈ సినిమా పవర్ స్టార్‏కు ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని

Kushi Movie: పవన్ కళ్యాణ్ బ్యూటీఫుల్ లవ్‏స్టోరీకి 21 ఏళ్లు.. ఖుషి నమ్మశక్యం కానీ ప్రయాణమంటూ భూమిక పోస్ట్..
Kushi
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‏లోనే అందమైన ప్రేమకథా చిత్రం ఖుషి (Kushi). ఈ సినిమా పవర్ స్టార్‏కు ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించింది. ఇందులోని పవర్ స్టార్ మ్యానరిజం.. ఆడిట్యూడ్.. స్టైల్‏కు యూత్ ఫిదా అయిపోయారు. ఖుషి సినిమాతో పవర్ స్టార్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ ఎస్ జె. సూర్య తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ సరసన భూమిక చావ్లా నటించింది. అటు పవర్ స్టార్‏కు మాత్రమే కాకుండా.. భూమికకు కూడా సూపర్ హిట్ అందించింది. భూమిక కెరీర్‏లోనే సెకండ్ మూవీగా వచ్చిన ఖుషి.. సంచలన విజయం సాధించింది. మంగళవారంతో ఈ సినిమాకు 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంది భూమిక..

“ఖుషికి 21 ఏళ్లు.. ఎన్నో జ్ఞాపకాలతో కూడిన అద్భుతమైన ప్రయాణం. ఈ సినిమా నన్ను భూమిక నుంచి మధుగా మార్చింది. నా సినిమా కెరీర్ లోనే నేను ఎక్కువగా ఇష్టపడే పాత్ర అది ” అంటూ క్యాప్షన్ ఇస్తూ.. ఏఎం రత్నం, డైరెక్టర్ ఎస్జే సూర్య, పవన్ కళ్యాణ్, బ్రింద మాస్టర్లను ట్యాగ్ చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను మంత్రముగ్దులను చేస్తాయి.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

Sonu Sood: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్..

Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..