
Adah Sharma: అందగా ఉంటుంది.. అభినయంతో ఆకట్టుకుంటుంది.. డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది. పాటలు కూడా పాడేస్తుంటుంది. ఇలా ప్రతీ పనిలో అందర్నీ అలరిస్తుంది.. వాహ్ వా.. అనేలా మనుసు గెలుచుకుంటుంది అదా. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అదా. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఆతర్వాత హీరోయిన్గా ఎందుకనో సక్సెస్ కాలేకపోయింది ఈ చిన్నది. ఒకటి రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా కనిపించి అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ముందుగా ఈ అమ్మడు అక్కడ సినిమాలతో అలరించిన తర్వాతే తెలుగులోకి వచ్చింది. బీ టౌన్లో 1920 హర్రర్ ఫిల్మ్ తో .. అందులోని తన పర్ఫార్మెన్స్తో టెర్రర్ పుట్టించిన అదా. ఇక ఇప్పుడు అక్కడ ఇక్కడ అవకాశలకోసం ఎదురుచూస్తుంది. త్వరలోనే తెలుగులో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ చిన్నది సిద్ధం అవుతుంది.
ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది అదా.. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో, రకరకాల వీడియోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ వీడియోతో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. జాతీయ గీతాన్ని ఫోన్ డైల్పాడ్లో వినిపించి తన సూపర్ ట్యాలెంట్‌ను మరో సారి అందరికీ చూపించింది. ఏంటి అర్థం కాలేదా.. అయితే ఈ వీడియో చూడండి.
మరిన్ని ఇక్కడ చదవండి :