AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teja Sajja: ‘ఔను.. పెళ్లి చేసుకుంటున్నా’.. అధికారికంగా ప్రకటించిన తేజ సజ్జా.. అమ్మాయి ఎవరో కూడా చెప్పేశాడుగా..

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వస్తోన్న తన పెళ్లి వార్తలను స్వయంగా తేజ సజ్జానే ధ్రువీకరించాడు. దీంతో పాటు తనకు కాబోయే భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Teja Sajja: 'ఔను.. పెళ్లి చేసుకుంటున్నా'.. అధికారికంగా ప్రకటించిన తేజ సజ్జా.. అమ్మాయి ఎవరో కూడా చెప్పేశాడుగా..
Teja Sajja
Basha Shek
|

Updated on: Oct 22, 2026 | 7:55 PM

Share

యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించి వస్తోన్న వార్తలను స్వయంగా అతనే అధికారికంగా ధృవీకరించాడు. తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, అభిమానులకు, మీడియాకు తన పెళ్లి ముహూర్తం వివరాలను పంచుకున్నారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిని అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా నిర్వహించనున్నట్లు తేజ సజ్జా తెలిపారు. ‘ఇది పూర్తిస్థాయిలో పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ వివాహాన్ని మా తల్లిదండ్రులు నిశ్చయించారు. పెద్దల సమక్షంలో కుదిరిన సంబంధం ఇది. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహం జరగనుంది.రాజస్థాన్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తేజ పేర్కొన్నారు. ఇక తేజ సజ్జా పెళ్లి చేసుకోబోతున్నాడంటే సహజంగానే అమ్మాయి ఎవరన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. ఈ విషయంపై కూడా మాట్లాడాడు తేజ. అమ్మాయికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని, బిజినెస్ ఫ్యామిలీ అని, అమెరికాలో పెరిగిందని హనుమాన్ హీరో తెలిపాడు. అయితే వధువు పేరును మాత్రం వెల్లడించలేదు తేజ. త్వరలోనే ఈ వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మొత్తానికి తన పెళ్లి శుభవార్త చెప్పి అభిమానుల కళ్లల్లో ఆనందం నింపాడు తేజ సజ్జా. ప్రస్తుతం హీరో పెళ్లి వార్తలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు తేజాకు ముందస్తుగా విషెస్ చెబుతున్నారు. ఇక సినిమా కెరీర్ విషయానకిఇ వస్తే.. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు తేజ సజ్జా. చిన్నతనంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఓ బేబీ, జాంబిరెడ్డి, ఇష్క్, అద్బుతం తదితర సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు తేజ. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతోనే తేజకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చింది. దీని తర్వాత వచ్చిన మిరాయ్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం జాంబిరెడ్డి నెక్ట్స్ లెవెల్ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ నటిస్తున్నాడు తేజ. అలాగే ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా కొనసాగుతున్నాడీ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ రియాలిటీ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us