
సినీరంగంలోకి ప్రేమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి. అయితే కొందరి ప్రేమకథలు మాత్రం ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. అందులో నటుడు సాయాజీ షిండే ఒకరు. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సహయ నటుడిగా, విలన్ గా వైవిధ్యమైన పాత్రలు పోషఇంచి తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఆయన భార్య అల్కా షిండేతో ఉన్న వయసు గురించి వచ్చిన కామెంట్స్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకంటే దాదాపు 15 ఏళ్లు చిన్నవారైనా అల్కా షిండేను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన , నమ్మకం, ప్రేమ వారి వైవాహిక బంధాన్ని నడిపించిందని అభిమానులు చెబుతున్నారు. సాయాజీ షిండే తన వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎప్పుడూ మీడియా ముందుకు తీసుకురాలేదు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్‌లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భార్య తనకంటే పది నుంచి పదిహేను సంవత్సరాలు చిన్నది కావడం వల్ల తాను తన స్నేహితులను ఎలా ఆటపట్టించేవాడో అనే విషయాన్ని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో సయాజీ షిండే తన ఇంటిని చూపించారు. ఈ సందర్భంగా, ఇంటి గోడపై ఉన్న తన భార్యతో గల పాత ఫోటో వెనుక ఉన్న కథను కూడా ఆయన చెప్పారు. “ఇది నాది, అల్కాది. మా ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అందుకే పెళ్లి తర్వాత, మీ అమ్మాయి పుట్టిందా? అని నా స్నేహితులు నన్ను ఆటపట్టించేవారు” అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..
ఒక పాత ఇంటర్వ్యూలో, వయసులో ఉన్న వ్యత్యాసంపై తమ కుటుంబం ఎలా స్పందించిందో కూడా అల్కా వెల్లడించారు. “నా తోబుట్టువులందరూ నాకంటే పెద్దవారు. నేను, సయాజీ కలిసినప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ సమయంలో మా అన్నయ్యకు ఒకే ఒక సమస్య కనిపించింది, అదే వయసు. మా ఇద్దరి మధ్య పదిహేను సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అందుకే నువ్వెలా సర్దుకుంటావు? అని నన్ను అడిగారు. కానీ అదే మా సన్నాహం. ఆ తర్వాత, సయాజీని కలిశాక, అతను తక్కువ సమయంలోనే అందరినీ మెప్పించడంతో కుటుంబం పెళ్లికి అంగీకరించింది” అని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో
Sayaji Shinde Movie
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..