Sita Ramam: ‘దుల్కర్ సల్మాన్ ఐ హేట్ యూ’.. సాయి ధరమ్ తేజ్ స్పెషల్ లెటర్.. నెట్టింట వైరల్..

|

Aug 09, 2022 | 6:08 PM

చిత్రం ముగిసే సమయానికి అఫ్రీన్ మరింత అందంగా ఉంది. రాముడు, సీతను కలిపేందుకు వారధిగా ఉన్నందుకు నేను నిన్ను ద్వేషిస్తున్నాను.

Sita Ramam: దుల్కర్ సల్మాన్ ఐ హేట్ యూ.. సాయి ధరమ్ తేజ్ స్పెషల్ లెటర్.. నెట్టింట వైరల్..
Sita Ramam
Follow us on

డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 5న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే.. దుల్కర్ సల్మాన్, మృణాల్ నటనపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ మొత్తం సీతారామం విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సీతారామం చిత్రానికి ఐ హేట్ యూ అంటూ స్పెషల్ లెటర్ రాశారు. ఈ లేఖను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. సాయి ధరమ్ తేజ్ వ్రాయునది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

” డియర్ హను. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. ఈ సినిమాలోని అన్ని పాత్రలను చాలా జాగ్రత్తగా అందంగా రూపొందించినందుకు. అంతేకాకుండా అందమైన పెయింటింగ్ లేదా అందమైన సంగీతంతో ప్రశాంతతను మీరు సృష్టించారు. అలాగే దుల్కర్ సల్మాన్.. నేను మీ మునుపటి చిత్రాలను చూశాను. మీ పనిని నేను ఎప్పటికీ ఆరాధిస్తాను. కానీ ఈ సినిమా విషయంలో నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా నటుడిగా నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి సన్నివేశంలో మీ నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. రామ్ గా మీరు ఊపిరి తీసుకున్నారు.. రామ్ గా మీరు జీవించారు.

ఇవి కూడా చదవండి

అలాగే రష్మిక.. చిత్రం ముగిసే సమయానికి అఫ్రీన్ మరింత అందంగా ఉంది. రాముడు, సీతను కలిపేందుకు వారధిగా ఉన్నందుకు నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఇక మృణాల్ నేను మీ పేరుపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాను ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ రాసిన లెటర్ నెట్టింట వైరల్ అవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.