Ram Charan: గొప్ప మనసు చాటుకున్న మెగా పవర్ స్టార్.. పాప ప్రాణాలు కాపాడిన రామ్ చరణ్..

|

Oct 17, 2024 | 9:00 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. గుండె సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి అండగా నిలిచాడు. 53 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి పాప ప్రాణాలు కాపాడాడు చరణ్. ఈ విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ ట్విట్టర్ వేదిక తెలియజేశాడు.

Ram Charan: గొప్ప మనసు చాటుకున్న మెగా పవర్ స్టార్.. పాప ప్రాణాలు కాపాడిన రామ్ చరణ్..
Chiranjeevi Ramcharan
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థలం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చరణ్.. ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచాన్నే ఫిదా చేశాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్.. విదేశాల్లోనూ తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రం చేస్తున్నాడు. ఇదివరకే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు చరణ్. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న చరణ్.. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. కష్టం వచ్చిన అభిమానులకు అండగా ఉంటున్నారు.

సామాజిక సేవలో ఇప్పటివరకు ఎంతోమందికి అండగా నిలిచిన చరణ్.. ఇప్పుడు మరో చిన్నారి ప్రాణాలు కాపాడాడు. గుండె సమస్యతో బాధపడుతున్న ఆ చిన్నారిని బతికించాడు. ఈ విషయాన్ని నిర్మాత SKN తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. “గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అభినందనలు. ఆగస్ట్ 22న ఒక పాప పుట్టింది. ఆ చిన్నారికి సీరియస్ హార్ట్ కండిషన్. పల్మనరీ హైపర్ టెన్షన్ తో బాధపడుతుంది. ఆ పాప ఫ్యామిలీకి ట్రీమెంట్ చేయించే స్తోమత లేదు. ఈ విషయం చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లడంతో ఆయన ఆ పాపకు కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం ఇప్పించారు. ఎప్పటికప్పుడు ఆ పాప గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. 53 రోజులు ట్రీట్మెంట్ తర్వాత అక్టోబర్ 16న ఆ పాపను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎస్కేఎన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. రామ్ చరణ్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి : OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే

డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వాని, హీరోయిన్ అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

SKN ట్వీట్.. 

ఇది చదవండి : OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.