వ్యాపారంలో భారీగా నష్టపోయా.. ఆ హీరో ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను

నటుడు హరి పేరు చెప్తే టక్కున గుర్తుపట్టక్కపోవచ్చు కానీ.. ఆయనను చూస్తే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ఆయన ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తున్నారు .

వ్యాపారంలో భారీగా నష్టపోయా.. ఆ హీరో ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను
Hari

Updated on: May 05, 2026 | 12:09 PM

నటుడు హరి గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి, ఎదుర్కొన్న సవాళ్ళ గురించి విపులంగా వివరించారు. 1984లో చెన్నైలో ఆయన చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. తన మొదటి చిత్రం విజయ బాబు రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన భార్యామణిలో శోభన్ బాబు, జయసుధలతో కలిసి ఒక చిన్న ఎస్ఐ పాత్ర. ఆ తర్వాత చిరంజీవి గారి చిత్రాలైన రుస్తుం, అగ్నిగుండం వంటి అనేక చిత్రాలలో నటించారు. చిరంజీవి గారికి విలన్‌గా, అన్నయ్యగా, స్నేహితుడిగా, ఇంకా నాయకురాలు వంటి చిత్రాలలో ఒక హీరోగా కూడా నటించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, తన మొహమాటం (బిడియం) తన కెరీర్‌కు పెద్ద అవరోధంగా మారిందని హరి తెలిపారు. ఎవరినీ అవకాశాలు అడగలేకపోయానని, అది తన నటనకు గుర్తింపు ఉన్నప్పటికీ, ఆశించిన ఫలితాలను అందించలేకపోయిందని వివరించారు. ఫలితంగా, నిరాశకు గురైన ఆయన 1994లో చిత్ర పరిశ్రమను వీడి, తన స్వస్థలం నెల్లూరుకు వెళ్లారట.

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

అక్కడ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలోకి దిగిన హరి, సరైన అవగాహన లేకపోవడంతో భారీ నష్టాలను చవిచూశారట. ఆ నష్టాలతో కట్టుబట్టలతో మిగిలిపోయిన స్థితిలో, మళ్ళీ సినీ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారట. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఒక రోజు చెన్నైలో చిరంజీవి అభిమానులు చిరంజీవి అక్కడే ఉన్నారని చెప్పడంతో, ఆయనను కలవడానికి అర్ధరాత్రి 9:30 గంటల సమయంలో చిరంజీవి గారి ఇంటికి వెళ్లారట. సాధారణంగా ఆ సమయంలో ఎవరినీ కలవని చిరంజీవి కుటుంబం, హరి అదృష్టం బాగుండి, సురేఖమ్మ బయటకు వచ్చి ఆయనను చూశారట. ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని, లోపలికి రమ్మని కూర్చోబెట్టారట. ఆ సమయంలో చిరంజీవి గారు స్నానం చేస్తున్నారని, వెంటనే వస్తారని సురేఖమ్మ  చెప్పారని హరి వివరించారు.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

సురేఖమ్మ గారిని ఆయన ఒక “బంగారు తల్లి”, “సీతాదేవి”, “అన్నపూర్ణాదేవి”గా అభివర్ణించారు, ఆమె గొప్ప మనసును ప్రశంసించారు. సురేఖమ్మ చొరవతో చిరంజీవి గారిని కలిసిన హరికి, ఆయన రెండవ ఇన్నింగ్స్‌కు మద్దతు లభించింది. చిరంజీవి గారు, “వచ్చేసేయ్, హైదరాబాద్‌లో మన ఆఫీసు ఉంది, అక్కడే ఉండు. రెండు సంవత్సరాలు కుటుంబాన్ని తీసుకురాకు, డిస్టర్బ్ అవుతావు. నాగబాబు సార్ చూసుకుంటాడు. మళ్ళీ ఒకసారి స్ట్రగుల్ చేయి” అని ప్రోత్సహించారట. చిరంజీవి గారి ఆ మాటలతో మళ్ళీ హరి గారి సినీ ప్రస్థానం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అప్పటినుండి ఆయన సీరియల్స్ ద్వారా తన నట జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us