Actor Darshan: రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్.. క్రూరంగా మారి హింసించిన దర్శన్..

|

Jun 15, 2024 | 3:11 PM

దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ ట్రోల్ చేశాడనే కారణంగానే అతడిని కిడ్నాప్ చేసి హత్య చేయించాడు హీరో దర్శన్. చిత్రదుర్గ నుంచి 200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిన రవి అనే వ్యక్తి శుక్రవారం లొంగిపోవడంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి.

Actor Darshan: రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్.. క్రూరంగా మారి హింసించిన దర్శన్..
Darshan
Follow us on

రేణుకస్వామి హత్య కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తుంది. ఇన్నాళ్లు సూపర్ స్టార్‏గా ప్రేక్షకుల ప్రేమను అందుకున్న హీరో ప్రియురాలి కోసం రాక్షసుడిలా మారాడు. పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని తెలిసి విచక్షణ కోల్పోయి తన వీరాభిమానినే దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసులో ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయి. తలను వాహనానికి గట్టిగా తగిలేలా బాదారు. అలాగే తల, పొట్ట భాగం, ఛాతీపైనా దుంగ కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్ర చిత్రహింసలు పెడుతూ ప్రైవేట్ పార్ట్స్ పై తన్నారు. ఇలా శరీరంపై మొత్తం 15 బలమైన గాయాలయ్యాయని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యాయి. తలకు బలంగా గాయం కావడం.. ప్రైవేట్ పార్ట్స్ పై తన్నడం కారణంగానే రేణుకస్వామి చనిపోయాడని పోలీసులు చెబుతుండగా.. ఇప్పుడు పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అసలు విషయాలు బయటకు వచ్చాయి.

దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ ట్రోల్ చేశాడనే కారణంగానే అతడిని కిడ్నాప్ చేసి హత్య చేయించాడు హీరో దర్శన్. చిత్రదుర్గ నుంచి 200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిన రవి అనే వ్యక్తి శుక్రవారం లొంగిపోవడంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. పోస్ట్ మార్టమ్ నివేదిక ప్రకారం.. రేణుకస్వామి తల, పొట్ట, ఛాతీ, ఇతర భాగాలపై అనేక బలమైన గాయాలున్నాయని రిపోర్టులో వెల్లడించింది. అలాగే అతడి తలను బలంగా వాహనానికి కొట్టారని.. అదే అతడి మరణానికి కారణమైందని పోలీసులు తెలిపారు. షాక్ కు గురికావడం.. తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు మృతి చెందినట్లు నివేదికలో తేలింది. అలాగే అతడి కాళ్లు, చేతులు, వీపు, ఛాతీలో రక్తస్రావం అయిందని.. గాయాలు బలంగా తగలడంతో రక్తం గడ్డకట్టడంతో అతడు ప్రాణాలు విడిచాడని తేలీంది. చెక్క కర్ర, బెల్టుతో అతడిపై పాశవికంగా దాడి చేశారు.

అంతేకాదు.. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం కుక్కలు అతడి ముఖాన్ని, మృతదేహంలోని కొన్ని భాగాలను తినేశాయని రోపోర్ట్ వెల్లడించింది. బాధితుడిని హింసించేందుకు ఉపయోగించిన చెక్క దుంగలు, లెదర్ బెల్ట్, తాడు సహా పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకస్వామి మృతదేహాన్ని కుక్కలు తినడం చూసిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. రేణుకస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు తన అభిమానులు ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెప్పున ఇస్తానని దర్శన్ ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతోపాటు మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.