
ప్రముఖ నటుడు ఆనంద్ భారతి.. ఇలా పేరు చెప్తే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు ఈ నటుడు. ముఖ్యంగా సహాయక పాత్రల్లో ఎక్కువగా నటించి మెప్పించాడు. ఇటీవల తన సినీ జీవితం, వ్యక్తిగత తత్వశాస్త్రంపైఓ ఇంటర్వ్యూలలో అనేక విషయాలు వెల్లడించారు. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన శీను చిత్రం తన కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే సినిమా అని ఆయన తెలిపారు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ సొల్లామలేకి రీమేక్ అని, దీనిని శశి దర్శకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. శీనులో తన పాత్ర బలంగా ఉందని, వెంకటేష్ వంటి స్టార్‌ను డామినేట్ చేసే సన్నివేశాలు ఉన్నప్పటికీ, వెంకటేష్ ఎప్పుడూ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని భారతి స్పష్టం చేశారు. వెంకటేష్ చాలా మర్యాదస్తుడని, ఆయన తన స్నేహితులకు కూడా కామన్ ఫ్రెండ్ అని, బయట కూడా తమకు పరిచయం ఉందని వివరించారు. శీను తమిళంలో సూపర్ హిట్ అయినప్పటికీ, తెలుగులో ఆశించిన విజయం సాధించలేకపోయిందని, దీనికి గల కారణాలు ఆనాటి పరిస్థితులు అయి ఉండవచ్చని పేర్కొన్నారు ఆనంద్ భారతి.
అదేవిధంగా, నటుడు రాజశేఖర్ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను ఆనంద్ భారతి ఖండించారు. రాజశేఖర్ సమయపాలన పాటించరని, సెట్‌లో ఇబ్బంది పెడతారని వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తాను రాజశేఖర్‌తో కలిసి పనిచేసినప్పుడు, ఆయన సమయానికి చాలా ముందుగానే సెట్‌కు వచ్చేవారని తెలిపారు. విజయకాంత్ నటించిన తమిళ చిత్రం రీమేక్‌లో రాజశేఖర్‌తో కలిసి పనిచేశానని, ఆ సమయంలో వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడిందని చెప్పారు. రాజశేఖర్ భార్య జీవిత గారితో కూడా తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. రాజశేఖర్ కు గర్వం ఉండదు.. ఎవరైనా ఫోన్ చేస్తే తిరిగి కాల్ చేసే అలవాటు ఉందని, ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదని భారతి వివరించారు. తాను 6-7 రోజులు కలిసి పనిచేసినప్పటికీ, రాజశేఖర్ నుండి ఎటువంటి నెగటివ్ వైఖరిని చూడలేదని అన్నారు.
వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ… గతంలో ఒక సందర్భంలో తన బ్యాంక్ ఖాతాలో 25 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి వచ్చానని, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా తన ఖాతా సున్నా అయిందని తెలిపారు. అయితే, ఈ పరిస్థితిని తన భార్యతో కలిసి స్వీకరించానని, ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జీవితంలో అప్పులు ఉండకూడదని, అప్పు లేకపోతేనే ధనవంతుడని ఆయన నమ్ముతారు. తనకు కొన్ని ఆస్తులు ఉన్నాయని, అవి చాలని, వందల ఎకరాలు సంపాదించడం వృథా అని ఆయన అభిప్రప్రాయపడ్డారు. తాను పిల్లల కోసం సంపాదించనని, తన కోసం తాను సంపాదిస్తానని, తాను సంపాదించిన డబ్బును తాను, తన భార్య మాత్రమే అనుభవించాలని ఆయన తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి