Aamir Khan: ‘చిరూ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి’.. మెగాస్టార్‌ను రిక్వెస్ట్ చేసిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్

|

Jul 25, 2022 | 1:22 PM

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు. ఓ వైపు షూటింగ్ లకు హాజరవుతూనే మరోవైపు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లకు ప్రెస్ మీట్స్ కు హాజరవుతున్నారు.

Aamir Khan: చిరూ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మెగాస్టార్‌ను రిక్వెస్ట్ చేసిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
Aamir Khan, Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు. ఓ వైపు షూటింగ్ లకు హాజరవుతూనే మరోవైపు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లకు ప్రెస్ మీట్స్ కు హాజరవుతున్నారు. తాజాగా మెగాస్టార్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాను తెలుగులో సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్(Aamir Khan)ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలకపాత్రలో కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఏర్పాటు చేసిన లాల్ సింగ్ చడ్డా మూవీ ప్రెస్ మీట్ లో మెగాస్టార్, అమీర్ ఖాన్, నాగచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అమీర్ మాట్లాడుతూ.. ‘ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది.అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి అన్నారు. తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.అందుకే  తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి మెగాస్టార్ చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగిందన్నారు అమీర్. ఇక  సల్మాన్ ఖాన్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు. చిరంజీవి నాకు కూడా అవకాశం ఇస్తే నేను ఆయనతో నటించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు అమీర్ ఖాన్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. మరి అమీర్ కోరుకున్నారు ఆయన మెగాస్టార్ రాబోయే సినిమాలో  కనిపిస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి