
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే తారక్.. బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కేవలం ఒక్కరోజు కాదు.. సోమవారం నుంచి గురువారం వరకు ఇక మిమ్మల్ని అలరించనున్నాడు. యంగ్ టైగర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి బుల్లితెరపై ఎన్టీఆర్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఈ షో గురించి నెట్టింట్లో రోజూ కథనాలు వస్తున్న క్రమంలో తాజాగా జెమిని టీషో ఈ షో ప్రోమోను విడుదల చేసింది.
ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో తారక్ వస్తున్న.. మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 నిమిషాలకు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ షో మొదటి ఎపిసోడ్‌కు అతిథిగా రామ్ చరణ్ వచ్చాడని.. తారక్ వేసిన ప్రశ్నలకు చెర్రీ తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పి రూ. 25 లక్షలు గెలుచుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్ టైగర్ రాజమౌళి తరెకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
వీడియో..
ట్వీట్..
Also Read: Meera Mithun: పోలీసులకే సవాల్ విసిరింది.. అడ్డంగా బుక్కైంది.. ఎట్టకేలకు బిగ్‌బాస్ బ్యూటీ అరెస్ట్..
Akhil Akkineni : అఖిల్ సినిమాకోసం హాలీవుడ్ యాక్షన్ ఫైట్ మాస్టర్స్.. ఛేజింగ్ ఎపిసోడ్ అదిరిపోతుందట..