Actress Vahini: క్యాన్సర్‏తో పోరాటం.. బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..

బుల్లితెర నటి వాహిని కన్నుమూశారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె..బుధవారం విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని.. అయినా ఫలితం లేకపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Actress Vahini: క్యాన్సర్‏తో పోరాటం.. బుల్లితెర నటి వాహిని మృతి.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
Actress Vahini

Updated on: Feb 05, 2026 | 7:31 AM

తెలుగు బుల్లితెర ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి వాసవి (పద్మ) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలం విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి తెలియజేస్తూ భావోద్వేగ పోస్ట్ చేసారు. తనను కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఎమోషనల్ అయ్యారు. గత కొన్ని రోజుల క్రితం వాహిని క్యాన్సర్ తో పోరాడుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె వైద్య ఖర్చులకు సాయం చేయాలని కోరింది. ఆ తర్వాత పలువురు సీనియల్ నటీనటులు సైతం వాహిని పరిస్థితిపై రియాక్ట్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

“వాహిని అక్కా నిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలం అయిన విజయనగరంలో స్వామిని చేరుకుంది. మొన్న చెప్పేశారు. ఇక కష్టం అని.. ఊరికి తీసుకెళ్లిపోయారట. ఆమె పవిత్ర ఆత్మకు శాంచి చేకూరాలని కోరుకుంటున్నాను. సద్గతి ఓం శాంతి. మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం పద్మక్క. కుటుంబానికి ప్రగఢ సానుభూతి తెలుపుతున్నాను ” అంటూ తన ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. వాహిని మరణవార్తపై పలువురు సినీప్రముఖులు, అభిమానులు రియాక్ట్ అవుతూ ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

చాలా కాలంగా సినీరంగంలో యాక్టివ్ గా ఉన్నారు వాహిని. 1978లో విజయనగరంలో జన్మించిన ఆమె.. టీవీ, సినీరంగాల్లో జయవాహిని పేరుతో పాపులర్ అయ్యారు. తెలుగు, తమిళం భాషలలో సీరియల్స్, సినిమాలు చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. చివరగా బహిర్భూమి అనే సినిమాలో నటించింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ జనాలకు దగ్గరయ్యింది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..