Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

ప్రస్తుతం సీరియల్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. హీరోహీరోయిన్లకు మించి బుల్లితెర ముద్దుగుమ్మలకు ఫాలోయింగ్ వస్తుంది. నిత్యం తమ యాక్టింగ్, అందంతో కట్టిపడేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీని తెలుగులో దాదాపు ఏడాదిపాటు బ్యాన్ చేశారు. ఇప్పుడు వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..
Pallavi Gowda

Updated on: Sep 01, 2025 | 7:40 AM

ప్రస్తుతం సీరియల్స్ ద్వారా బుల్లితెర సినీప్రియులను అలరిస్తున్న ముద్దుగుమ్మలు.. నెట్టింట చేసే హంగామా గురించి చెప్పక్కర్లేదు. అందం, అభినయంతో స్మాల్ స్క్రీన్ పై కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీలకు సినిమా హీరోయిన్లకు ఉండే క్రేజ్ ఉంటుంది. సీరియల్స్ ద్వారా ప్రతిరోజు తెలుగు ఫ్యామిలీ అడియన్స్ ముందుకు వస్తూ తమ నటనతో కట్టిపడేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ భామలు తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సీరియల్స్ ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత సినిమా అవకాశాలు సైతం అందుకున్నారు. కానీ మీకు తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సీరియల్ బ్యూటీని తెలుగులో దాదాపు ఏడా

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

ఇవి కూడా చదవండి

ఈ బ్యూటీ పేరు పల్లవి గౌడ. పసుపు కుంకుమ సీరియల్ ద్వారా తెలుగు ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సావిత్రి, చదరంగం, సూర్యకాంతం వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. మొదటి సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఏ సీరియల్లో కనిపించలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనను ఇండస్ట్రీలో బ్యాన్ చేయడానికి గల రీజన్ చెప్పింది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

తను రెండు సీరియల్ చేస్తున్న సమయంలో సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. పర్మిషన్ తీసుకుని మరీ షూటింగ్ కు వెళ్లానని తెలిపింది. అయితే అనుకోకుండా బెంగుళూరులో 20 రోజులు లాక్ అయ్యానని.. ఆ తర్వాత షూటింగ్ కు వెళ్లానని.. అటు సీరియల్స్, ఇటు సినిమాలు షూటింగ్ జరగడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్నా డబ్బులు ఇవ్వలేదని.. ఆ తర్వాత సీరియల్ జరుగుతున్నప్పుడు మరో ప్రాజెక్టుకు ఎలా అగ్రిమెంట్ చేస్తావ్ అని తనను బెదిరించారని.. ఆ తర్వాత కొన్నాళ్లకే తనను బ్యాన్ చేశారని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో వరుస సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..