Bigg Boss Telugu 10: నాగార్జున హోస్ట్‌గా ఉంటే బిగ్‌బాస్‌హౌస్‌లోకి అడగు పెట్టను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు బ్రాండ్ అంబాసిడర్ అక్కనేని నాగార్జుననే అని చెప్పవచ్చు. గత ఏడు సీజన్లుగా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కూడా అక్కినేని నాగార్జుననే ముందుండి నడిపించనున్నారు.

Bigg Boss Telugu 10: నాగార్జున హోస్ట్‌గా ఉంటే బిగ్‌బాస్‌హౌస్‌లోకి అడగు పెట్టను.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Bigg Boss Telugu 10

Updated on: Jul 05, 2026 | 6:42 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి వరుసగా ప్రోమోలు కూడా వస్తున్నాయి. అలాగే సామాన్యుల ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక సీజన్ సీజన్ కు కంటెస్టెంట్స్ మారుతున్నా బిగ్ బాస్ షోకు అసలైన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జునే అని చెప్పవచ్చు. బిగ్ బాస్ తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి మాత్రం కింగ్ నాగార్జునే ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తన దైన వాక్చాతుర్యం, స్టైల్‌తో బిగ్ బాస్ షోను ముందుండి నడిపిస్తున్నారు కింగ్. ఇంకా నిజం చెప్పాలంటే నాగార్జున వచ్చాకే ఈ రియాలిటీ షో మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అలాగే టీఆర్పీ పరంగానూ అగ్రస్థానంలో నిలిచింది.

ఇక ఇప్పటిదాకా ఈ షోలో పార్టిసిపేట్ కంటెస్టెంట్స్ అందరూ కూడా నాగార్జున హోస్టింగ్ ను మెచ్చుకున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నాగార్జునపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీకెండ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ను నాగ్ తిట్టినప్పుడు వారి అభిమానులు కింగ్ ను విమర్శిస్తు పోస్ట్ లు పెట్టడం కామన్ గా జరుగుతోంది. అలాగే సీపీఐ నారాయణ వంటి రాజకీయ నాయకులు కూడా బిగ్ బాస్ తో పాటు నాగార్జునపై కూడా విమర్శలు గుప్పించారు. ఇలా బయట నుంచి మాత్రమే కాదు కొందరు మాజీ కంటెస్టెంట్స్ కూడా నాగార్జునను విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున విఫలమయ్యారని, ఆయన తీరు సరిగ్గా లేదని, షో మొత్తం స్క్రిప్టెడ్ అని సంచలన ఆరోపణలు చేసింది. ఇక పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి  ఈ షోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సోనియా ఆకుల అయితే తనకు నాగార్జున హోస్టింగ్ నచ్చలేదని చెప్పేసింది. ఆయన హోస్ట్ గా ఉంటే మరోసారి బిగ్ బాస్ అవకాశం వచ్చినా.. తను హౌస్ లోకి అడుగు పెట్టనని కరాఖండిగా చెప్పేసింది. వీరే కాదు మరి కొంత మంది కంటెస్టెంట్లు కూడా నాగార్జున హెస్టింగ్ పై విమర్శలు గుప్పించిన సందర్భాలుఉన్నాయి. నాగార్జున ఎసిపోడ్స్ అన్నీ చూడరని.. కనీసం కంటెస్టెంట్స్ చెప్పిన విషయాలు కూడా సరిగ్గా వినరని ఆ మధ్యన ఓ మాజీ కంటెస్టెంట్ ఆరోపించింది.

నాగార్జున హోస్టింగ్ ను విమర్శించిన సోనియా ఆకుల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us