బిగ్ బాస్ సీజన్ 5 విజవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మూడు ఎలిమినేషన్స్ జరిగాయి. అందులో మొదటి వారంలోనే సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. ఆ తర్వాత రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడవ వారంలో లహరి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక నిన్న నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. గత వారంలో జరిగిన గొడవలను కొనసాగిస్తూ.. ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ సైకోలుగా ప్రవర్తించారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా లోబో.. దారుణంగా అరుస్తూ.. ప్రియపై రెచ్చిపోయాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా తానేమి తక్కువ కాదన్నట్టుగా విశ్వరూపం చూపించగా.. యంకర్ రవి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. మొత్తానికి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్.. మొత్తం 8 మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.
ఇక ఈసారి ఎనిమిది నామినేట్ అవ్వగా.. ఇందులో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. పై ఎనిమిది మందిలో సన్నీ, ప్రియ, యాంకర్ రవి, సిరిలకు ఎలాంటి ఢోకా లేదు. వీరు సేఫ్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా సభ్యులు.. లోబో.. నటరాజ్ మాస్టర్, కాజల్, యానీ మాస్టర్ డేంజర్ జోన్లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు లోబో ఇంట్లో ఉండి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. నిజాంగా చెప్పాలంటే.. లోబో మినహా.. మిగతా ఇంటి సభ్యుల నుంచి ఎలాంటి ఆట తీరు.. స్టాటజీ కనిపించకపోగా.. షో చప్పగా సాగుతుందనేది ముందు నుంచి ఉన్న వాదన.. ఒకవేళ ఈసారి లోబో ఎలిమినేట్ అయితే.. కచ్చితంగా బిగ్ బాస్ షో బోరింగ్‌గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా చూసుకుంటే లోబో కాస్త సేఫ్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలింది. యానీ మాస్టర్.. నటరాజ్ మాస్టర్, కాజల్..
ఇందులో కాజల్ బిగ్ బాస్ షో మొదటి రోజు నుంచి ఓవరాక్షన్‌తో అతి చేసిందని.. కావాలని లీడ్ తీసుకుంటే.. ఇంట్లో ఇద్దరు సభ్యులు మాట్లాడుకుంటే మధ్యలోకి వస్తుందని.. మొదటి ఎలిమినేషన్ ప్రక్రియలోనే తెల్చీ చెప్పారు కంటెస్టెంట్స్. దీంతో రెండో వారంలోనే కాస్త దూకుడు తగ్గించుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఇంట్లో సభ్యులకు కూడా మంచి రిలేషన్ ఏర్పర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలా చూసుకుంటే.. కాజల్ కూడా సేఫ్ అనుకోవచ్చు. ఇక ఎటోచ్చి… ప్రమాదంలో ఉన్నది మాత్రం నటరాజ్ మాస్టర్. యానీ మాస్టర్. ఇందులో నటరాజ్ మాస్టర్ కు కోపం ఎక్కువే. తనను నామినేట్ చేసిన వ్యక్తిని.. అందుకు గల కారణాన్ని మనసులో పెట్టుకుని.. వీక్ మొత్తం వారితో గొడవ పడుతూనే ఉంటాడు అని ఇప్పటికే కంటెస్టెంట్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ టాస్కులలో మాత్రం స్ట్రాంగ్ అని.. అలాగే ముక్కుసూటిగా మాట్లాడతాడు అని అటు ఇంట్లో సభ్యులే కాకుండా.. బయట నెటిజన్స్ టాక్ కూడా. ఇదిలా ఉంటే.. యానీ మాస్టర్.. మొదటి నుంచి ప్రతి చిన్న విషయానికి పెద్దగా అరుస్తూ… తన కంటే చిన్నవారితో సైతం గొడవకు దిగుతుండడంతో.. ఆమె నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిందని నెట్టింట్లో టాక్. అలాగే వెళ్లిన మొదటి రెండు, మూడు రోజులు మినహా.. యానీ మాస్టర్ అంతగా ఎంటర్ టైన్ చేయడం లేదని.. అలాగే.. ఇంట్లోని సభ్యులు ఏం మాట్లాడుకున్నా.. మధ్యలో వచ్చి గోడవ చేస్తుందని.. పెద్దగా అరుస్తుందని యానీ మాస్టర్ పై అసహనం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా.. యానీ మాస్టర్‌కు సపోర్ట్ అంతగా లేనట్టుగా తెలుస్తోంది. దీంతో ఈసారి ఇంటి నుంచి యానీ మాస్టర్ బయటకు వెళ్లనున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. నెట్టింట్లో జరిపిన ఓటింగ్ ప్రక్రియలోనూ.. యానీ మాస్టర్ ఎలిమినేట్ కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వారం వారి ప్రవర్తన బట్టి కూడా ప్రేక్షకులు ఓట్లు వేసే విధానం మారవచ్చు.. అందులో కచ్చితంగా ఎవరు వెళ్తారనేది మాత్రం.. ఈవారం వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందనేది నెటిజన్స్ అభిప్రాయం.