Bigg Boss 5 Telugu Lobo: షణ్ముఖ్‏కు వచ్చే భార్య కూడా అలా చేయదు.. సిరి, షన్నూ గురించి లోబో ఆసక్తికర వ్యాఖ్యలు..

బిగ్‏బాస్ రియాల్టీ షో.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి టాస్కులు వస్తాయో చెప్పడం కష్టం.. కానీ.. వారం వారం జరిగే నామినేషన్స్

Bigg Boss 5 Telugu Lobo: షణ్ముఖ్‏కు వచ్చే భార్య కూడా అలా చేయదు.. సిరి, షన్నూ గురించి లోబో ఆసక్తికర వ్యాఖ్యలు..
Lobo
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2021 | 3:33 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి టాస్కులు వస్తాయో చెప్పడం కష్టం.. కానీ.. వారం వారం జరిగే నామినేషన్స్ బట్టి.. ఇంటి నుంచి ఎవరు బయటకు వెళతారు అనేది సులువుగా తెలిసిపోతుంది. ఇక ముందు నుంచి చెప్పినట్టుగానే ఎనిమిదవ వారం లోబో హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత బిగ్‏బాస్ బజ్ షోలో అరియానాతో ఇంటిసభ్యులపై తన ఒపెనియన్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ముందుగా జెస్సీని స్వార్థుపరుడని.. అందరూ కొత్త వాళ్లే ఉండడంతో రవిని నామినేట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. అలాగే కాజల్ అందరికి నెగిటివ్ గా కనిపిస్తుందని.. కానీ కాజల్ అలా కాదంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. అలాగే జెస్సీ.. షణ్ముఖ్, సిరిలతో ఫ్రెండ్ షిప్ చేయడం వలన ఇంట్లో కంటిన్యూ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడని చెప్పాడు. అలాగే షణ్ముఖ్‏కు డిఫరెంట్ యాట్యిడ్యూడ్ ఉందని.. తనకు గేమ్ ప్లాన్ తెలుసనని.. తను, సిరి ఇద్దరూ గేమ్ ప్లాన్ చదివేసినట్లుగా గేమ్ ఆడుతున్నారన్నాడు. అలాగే రవి.. చిన్న మాటాలకు పెద్దగా సమాధానాలు చెప్పడం నచ్చదని.. అలా వద్దని తనతో చెప్పాలనుకుంటున్నట్లుగా లోబో అన్నాడు. ఇక సిరి గేమ్ బరాబర్ ఆడుతుందని.. అయితే అప్పుడప్పుడు పప్పులో కాలు పెడుతుందని చెప్పాడు. ఇక షణ్ముఖ్, సిరి మధ్య రిలేషన్ గురించి అరియానా ప్రశ్నించగా.. ఉదయం లేవగానే షన్నూకు బ్రష్ ఇస్తది.. షణ్ముఖ్ పనులు చేస్తుంది. అతనికి వచ్చే భార్య కూడా అలా చేస్తుందో లేదో కూడా తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

అలాగే.. తను బస్తీ నుంచి వచ్చానని.. తనను ప్రేక్షకులే ఆదరించారంటూ.. తన మైండ్ లో ఒక మాట.. నోటి నుంచి మరో మాట రాదని కన్నీళ్లు పెట్టుకున్నాడు లోబో.. ఇక ఇంటి సభ్యుల గురించి తనదైన స్టైల్లో కామెంట్స్ చేశాడు లోబో. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ తర్వాత లోబో గురించి మాట్లాడిన మాటలను అరియానా వీడియో చూపించగా.. తనపై ఎలాంటి కోపం లేదని.. కేవలం గేమ్ వరకు మాత్రమే ఆ మాటలంటూ చెప్పుకొచ్చాడు. ఇక తొమ్మిదో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కెప్టెన్ షణ్ముఖ్ మినహా.. మిగతా ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.

Also Read: Samantha: నేను పర్‍ఫెక్ట్ కాదు.. అయినా నేను స్ట్రాంగ్.. సమంత చెప్పిన ఈ మాటలకు అర్థమేంటో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!