
బిగ్‌బాస్ (Bigg Boss) రియాల్టీ షోకు బుల్లితెరపై ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా.. ఈ షోను ఆదరించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు హిందీతోపాటు.. తెలుగు, తమిళ్ భాషలలోనూ సక్సెస్ఫుల్ అయ్యింది. అయితే ఇటీవల తమిళ్ బిగ్‌బాస్ షో హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సీనియర్ నటి రమ్యకృష్ణ చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా బిగ్‌బాస్ తమిళ్ హోస్ట్ ఇతడే అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమిళ్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది.
ఇక పై స్టార్ హీరో శింబు తమిళ్ బిగ్‌బాస్ షో హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు నిర్వాహకులు. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఓపెన్ కావడంతో.. అటు సినిమా షూటింగ్స్ కు .. ఇటు బిగ్ బాస్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించడం వీలు కాకపోవడంతో షో నుంచి తప్పుకుంటున్నట్లుగా కమల్ ప్రకటించారు. ఇక ఇప్పుడు కమల్ స్థానంలో స్టార్ హీరో శింబు ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇక మరో రెండు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభంకానుంది. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా..సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయినవారు పాల్గోనబోతున్నట్లుగా సమాచారం.బిగ్‌బాస్ ఓటీటీ దాదాపు 84 రోజులు.. అంటే 12 వారాలు ఉండే అవకాశం ఉందని.. ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి మరిన్ని రోజులు పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారట నిర్వహకులు.
Also Read: Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్‌మీడియా ట్రెండింగ్
Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..
Bheemla Nayak: పవర్ స్టార్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..